టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా రిలీజ్ అయిన 2 రోజుల్లోనే దాదాపుగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సెకండాఫ్ లో విలన్ పాత్రలో కనిపించే కన్నడ నటుడు తారక్ పొన్నప్ప యాక్టింగ్ అద్భుతంగా చేశాడంటూ సినీ విమర్శకులు ప్రశంసిస్తున్నారు.
ముఖ్యంగా ఈ సినిమాకే హైలెట్ గా నిలిచిన జాతర ఫైట్ సీన్స్ లో ఎక్స్ప్రెషన్స్ ఏమాత్రం తగ్గకుండా సూపర్ గా నటించాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అయితే నటుడు తారక్ పొన్నప్ప పుష్ప 2 గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులోభాగంగా డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 సినిమాకోసం తీవ్రంగా శ్రమించాడని అన్నాడు. అలాగే ప్రతీ సీన్, సెట్, స్క్రీన్ ప్లే, స్టోరీ ఇలా ప్రతీది దగ్గరుండి చూసుకుంటూ జాగ్రత్తగా తీశారని తెలిపాడు. ఇక లీకుల బెడద ఉండకూడదని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆర్టిస్టులతో సహా ఎవరికీ ఫోన్ అనుమతించేవారు కాదని, అలాగే షూటింగ్ కి వచ్చే ముందు ఫోన్స్ లాకర్ రూం లో హ్యాండోవర్ చేసి రావాల్సి ఉంటుందని అందుకే లీక్స్ సమస్య ఎదురు కాలేదని తెలిపాడు.
సెట్స్ లో బౌన్సర్లు ఉండేవారని దాంతో వారు అందరినీ గమనిస్తూ నిఘా ఉంచేవారని వెల్లడించాడు. ఈ క్రమంలో ఒకరిద్దరు ఆర్టిస్టులు సినిమా సెట్స్ లో సెల్ ఫోన్ ఉపయోగించడం సుకుమార్ కంటపడటంతో వారినిపిలిచి వార్నింగ్ ఇవ్వడంతోపాటు ఇకపై షూటింగ్ కి రావద్దంటూ బ్యాన్ చేసాడని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా తారక్ పొన్నప్ప కెరీర్ విషయానికొస్తే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కేజీఎఫ్ సినిమాలో విలన్ గా నటించి కెరీర్ ఆరంభించాడు. ఈ సినిమాలో తారక్ పొన్నప్ప పాత్రకి మంచి స్కోప్ ఉండటంతో టాలెంట్ నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కీజీఎఫ్ 2, సి.ఎస్.ఐ, యువరత్న(కన్నడ) తదితర సినిమాల్లో నటించే ఆఫర్లు దక్కించుకున్నాడు. అయితే ఇటీవలే ఓటిటి లో రిలీజ్ అయిన వికటకవి అనే వెబ్ సీరీస్ లో హీరో తండ్రి పాత్రలో నటించాడు. ఈ వెబ్ సీరీస్ కూడా డీసెంట్ టాక్ తో ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.