కేజ్రీ అప్డేట్: దర్శకుడు సుకుమార్ కూతురు సినిమాల్లోకి .. ఆకట్టుకుంటున్న టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్

కేజ్రీ అప్డేట్: దర్శకుడు సుకుమార్ కూతురు సినిమాల్లోకి .. ఆకట్టుకుంటున్న టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి లీడ్‌‌ రోల్‌‌లో పద్మావతి మల్లాది తెరకెక్కించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’.  మైత్రీ మూవీ మేకర్స్‌‌, సుకుమార్‌‌ రైటింగ్స్‌‌, గోపీ టాకీస్‌‌ సంస్థలు నిర్మించాయి.

ఇప్పటికే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం జనవరి 24న విడుదల కాబోతోంది. ‘మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించే ఓ చిన్నారి తన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనేది కథ.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఇందులో ఉన్నాయి’ అని దర్శకురాలు తెలిపారు.  ఆనంద్‌‌ చక్రపాణి, రఘురామ్‌‌, భాను ప్రకాష్‌‌, రాగ్‌‌ మయూర్‌‌ ఇతర పాత్రలు పోషించారు.