విరూపాక్ష మూవీపై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విరూపాక్ష మూవీపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తన  శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ స్పైన్ థ్రిల్లింగ్ మూవీ.. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సాధించింది. మెగా హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా వచ్చిన ఈ మూవీ.. కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఈ  సినిమా సూపర్ సక్సెస్ సాధించిన సంధర్బంగా మూవీపై సుకుమార్ ప్రశంసల వర్షం కురిపించారు."వావ్ అని మాత్రమే చెప్పగలను అంటూ సుకుమార్ పోస్ట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నువ్ నాకు స్క్రిప్ట్ నేరెట్ చేసినప్పుడే తెలిసింది.

కానీ.. 24 క్రాఫ్ట్స్ ను ఉపయోగించి ఇంత అద్భుతమైన విజువల్స్ ను స్క్రీన్ పై చూపిస్తావ్ అని అస్సలు అనుకోలేదని ఆయన అన్నారు, ఇక ఈ ప్రాజెక్ట్ ను నమ్మి చేసినందుకు హీరో సాయి ధరమ్ తేజ్ పై, సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరిపై ప్రశంసలు కురిపించారు సుకుమార్.