![Sukumar: అతను లేకుండా నేను సినిమా తీయలేను.. పుష్ప 2 సక్సెస్ మీట్లో సుకుమార్ ఎమోషనల్](https://static.v6velugu.com/uploads/2025/02/sukumar-speech-at-pushpa-2-the-rule-thank-you-meet_yYE4oXf2dl.jpg)
పుష్ప 2 సక్సెస్ మీట్ శనివారం ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. హీరో అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లతో ఉన్న తన బాండింగ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక పైన కూడా దేవిశ్రీ లేకుండా సినిమాను చేయనేమో అనిపిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే నా పేరు ఓన్లీ సుకుమార్ కాదు. నా పేరు దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ అనేలా మారిందన్నారు.
ఇప్పటికీ ‘పుష్ప’ పూర్తి కథ అల్లు అర్జున్ కు చెప్పలేదని, ఇది జస్ట్ సెకండ్ ఇంటర్వెల్ మాత్రమే అని సుకుమార్ తెలిపారు. అలాగే ‘పుష్ప3, 4’ ఇలా ఎన్ని భాగాలు అవుతుందో కూడా చెప్పలేనని అన్నారు. సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా డైరెక్టర్ సుకుమార్ థ్యాంక్స్ చెప్పారు.
అయితే, పుష్ప 2 సినిమాలో దేవి శ్రీ ఇచ్చిన సంగీతం విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. అల్లు అర్జున్ స్వాగ్కి, జాతర సీన్స్లో వచ్చే ఎలివేషన్ సీన్స్కి అద్దిరిపోయేలా మ్యూజిక్ ఇచ్చాడు. ఇక సాంగ్స్ అయితే చెప్పక్కర్లదు. సోషల్ ఇండియాలో వందల మిలియన్ల కొద్దీ వ్యూస్తో దూసుకెళ్తోన్నాయి.