
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) పుష్ప (The Rise - Part 1) మూవీ క్లైమాక్స్ ఈగోతో ప్రేక్షకుల్లో హై ఇంటెన్సిటీ కలిగించింది. పుష్పరాజ్ డైలాగ్స్ తో.. కోపంతో రగిలిపోయిన బన్వర్ సింగ్ షెకావత్ నిక్కరుతో ఇంటికెళ్తాడు. ఆ తరువాత మొదలయ్యే పుష్ప2 (The Rule) అంతకు మించి ఈగో తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
తాజాగా యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య సాలిడ్ సన్నివేశాలు సుకుమార్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దరి ఈగోని బేస్ చేసుకుని వచ్చే సన్నివేశాలు నెక్స్ట్ లెవల్లోనే ఉంటాయంటున్నారు. ఇప్పటివరకూ ఇండియన్ తెరపై అంతటి బలమైన సన్నివేశాలు చూసి ఉండరని..ఎవరి ఊహకందని విధంగా ఆయా సన్నివేశాలు డిజైన్ చేసినట్లు వినిపిస్తుంది.
ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా ఎదిగిన పుష్పరాజ్ ను ఢీ కొట్టడం కోసం భన్వర్ సింగ్ ఎంతకైనా తెగించే వాడిగా కనిపిస్తాడని టాక్. వీరిద్దరి మధ్య ఈగోతో పాటుగా డబ్బును ప్రధానాంశంగా చూపించబోతున్నాడట సుకుమార్. ఒకానొక టైంలో! ఈగో కారణంగా ఒంటరి వాడిగా మిగిలిపోయిన పుష్ప రాజ్ ని చూపించబోతున్నారుట సుకుమార్. దీంతో పుష్ప 1 కు వచ్చిన కొన్ని విమర్శలకు పుష్ప 2 తో చెక్ పెడతాడని సమాచారం.
ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న( Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil), కన్నడ నటుడు ధనంజయ, సునీల్( Sunil), అనసూయ(Anasuya) తదితరులు విలన్స్‌గా నటిస్తున్నారు.