భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఆదివారం జరిగిన ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ లో 133 మంది ఆబ్సెంట్ అయ్యారని నోడల్ ఆఫీసర్ సులోచనారాణి పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్‌కు సంబంధించి ప్రాక్టికల్స్ ఒకేషనల్ విభాగంలో 81 మంది, జనరల్ విభాగంలో 23 మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ ఒకేషనల్ విభాగంలో 17 మంది, జనరల్ విభాగంలో 12 ఆబ్సెంట్ అయ్యారని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 40 మందికి గాను 29 మంది, పాల్వంచ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 40 మందికి గాను 10 మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.