జొహార్ బహ్రు (మలేసియా) : మూడుసార్లు చాంపియన్ ఇండియా సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ జూనియర్ మెన్స్ హాకీ టోర్నీలో అజేయంగా దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 4–2తో ఆతిథ్య మలేసియాను ఓడించింది.
శర్దానంద్ తివారి (11వ నిమిషం), అర్ష్‌దీప్ సింగ్ (13వ ని), తలెమ్ (39వ ని), రోహిత్ (40 వ ని) తలో గోల్‌తో జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ తర్వాత ఇండియా 9 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.