తరలిపోయిన ఆఫీసులను తెరిస్తాం : విజయరమణారావు

  • ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు : సుల్తానాబాద్ పట్టణం నుంచి తరలిపోయిన ప్రభుత్వ ఆఫీసులను రీఓపెన్​ చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హామీ ఇచ్చారు. రెండేండ్లుగా బంద్​ అయిన ఆధార్ కేంద్రాన్ని ఎమ్మెల్యే శుక్రవారం తిరిగి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధార్ సెంటర్ లేక సుల్తానాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ సెంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఇక్కడి నుంచి తరలివెళ్లిన ఐసీడీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్ డబ్ల్యూఎస్, ఆర్అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఆఫీసులను తీసుకొచ్చేందుకు కృషిచేస్తానన్నారు.

సుల్తానాబాద్ లో అన్ని రకాల ఆర్టీసీ బస్సులు నిలపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. ఆయన వెంట జడ్పీటీసీ మినుపాల స్వరూప, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ గాజుల లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ సమత, ఎంపీటీసీ అనూష, లీడర్లు ఎం.ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, అన్నయ్య గౌడ్, దామోదర్ రావు, శ్రీనివాస్, అబ్బయ్య గౌడ్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పాల్గొన్నారు .