సుల్తానాబాద్ పీఏసీఎస్ కు మరో అరుదైన గౌరవం

సుల్తానాబాద్, వెలుగు:  రైతులకు సేవలు అందించడంలో, ఆర్థిక పరిపుష్టి సాధించడంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన సుల్తానాబాద్ పీఏసీఎస్​ (పాక్స్​)కు  మరో అరుదైన గౌరవం దక్కిందని సొసైటీ చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని నీరుకుల్ల, గట్టేపల్లి, కదంబాపూర్, కాట్నపల్లి, కొమండ్లపల్లి గ్రామాల్లో సోమవారం వడ్ల కొనుగోలు సెంటర్లను ఎంపీపీ బాలాజీ రావు తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టెస్కాబ్ వారు సీటీఐ ద్వారా సుల్తానాబాద్ పీఎసీఎస్​ సక్సెస్ స్టోరీని రూపొందించి యూపీలోని లక్నో కేంద్రంగా జాతీయస్థాయిలో పనిచేస్తున్న బర్డ్ కు పంపించారని తెలిపారు. ఈ సక్సెస్ స్టోరీని  బర్డ్ ద్వారా అన్ని రాష్ట్రాల్లోని సహకార శిక్షణా కేంద్రాల్లో అధ్యయనం చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో సీఈవో సంతోష్, ఏఎంసీ చైర్ పర్సన్ బుర్ర మౌనిక, శ్రీనివాస్, సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.