హైడ్రాను గుర్తుచేసే ఝాన్సీ ఐపీఎస్ : ప్రతాని రామకృష్ణ గౌడ్

హైడ్రాను గుర్తుచేసే  ఝాన్సీ ఐపీఎస్ : ప్రతాని రామకృష్ణ గౌడ్

లక్ష్మీ రాయ్ ఫిమేల్ లీడ్‌‌‌‌గా  గురుప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన కన్నడ  చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. ఇప్పటికే కన్నడ, తమిళ భాషల్లో విడుదల కాగా, ఈనెల 29న  తెలుగులో  ప్రతాని రామకృష్ణ గౌడ్  రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కు నిర్మాత ఏఎం రత్నం, నటుడు సుమన్ అతిథులుగా హాజరై ఈ చిత్రం ఎందరో మహిళలను ఇన్‌‌‌‌స్పైర్ చేసేలా ఉంటుందని టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎన్నో ఘన విజయాలు సాధించాయి. అలాంటి ప్రయత్నమే మా సంస్థ ద్వారా ఈ చిత్రంతో చేస్తున్నాం. 

ఇందులో  లక్ష్మీ రాయ్ త్రిపాత్రాభినయం చేశారు. భూ కబ్జాలు చేసి బిల్డింగ్స్ కట్టిన వారి భవనాలు కూల్చే ఐపీఎస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ గా ఆమె కనిపిస్తారు. ఆమె పాత్ర చూస్తే ఇప్పటి హైడ్రా గుర్తుకు వస్తుంది. అలాగే  గ్లామరస్‌‌‌‌గా ఉండే మరో క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు డ్రగ్స్ ముఠాను వేటాడే పాత్రలో ఆమె నటించారు’ అని చెప్పారు.  నిర్మాత ఎ గురురాజ్, టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్, నటి అక్సాఖాన్ తదితరులు పాల్గొన్నారు.