- గ్రామాల్లో ఎవరిని అడిగినా సమస్యలే చెప్తున్నరు
- కాంగ్రెస్ గెలిస్తేనే చెన్నూర్‌కు న్యాయం
కోల్ బెల్ట్, వెలుగు: చెన్నూర్ ప్రజలు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ఓడించి, బాధలనుంచి విముక్తి పొందేందుకు సిద్ధమయ్యారని, సుమన్ ఓటమితోనే ప్రజలు సంతోషంగా ఉంటారని కాంగ్రెస్అభ్యర్థి వివేక్‌వెంకటస్వామి సతీమణి సరోజ అన్నారు. సోమవారం ఆమె మందమర్రిలోని నార్లాపూర్, మార్కెట్ఏరియాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏ ఇంటికి వెళ్లి అడిగినా ప్రజలు సమస్యలే చెప్పుకుంటున్నారని, బీఆర్‌ఎస్‌పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.
తెలంగాణ వచ్చి పదేండ్లు గడుస్తున్నా గ్రామాల్లోని ప్రజల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేదని, కూలిపోతున్న ఇండ్లు, కనీస సౌలతులు లేని ప్రాంతాల్లో ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన చెందారు. చెన్నూర్నియోజకవర్గంలోని ఊర్లలో ఎక్కడ చూసినా రోడ్లు, డ్రైనేజీలు పాడైపోయి కనిపిస్తున్నాయన్నారు. ప్రజలను సుమన్ రాక్షసుడిలా పీడిస్తూ రక్తం తాగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బికారిగా వచ్చిన బాల్క సుమన్ ఐదేండ్లలో ఇసుక దందా, బొగ్గు మాఫియా, భూకబ్జాలతో వేల కోట్లు వెనుకేసున్నాడని విమర్శించారు. తెలంగాణలో దివంగత ఎంపీ కాకా వెంకటస్వామి హయాంలో జరిగిన అభివృద్ధినే బీఆర్ఎస్ నాయకులు క్లైమ్ చేస్తున్నారని ఆరోపించారు.
బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమని, వివేక్ వెంకటస్వామిని గెలిపించేందుకు చెన్నూర్ప్రజలు రెడీ అయ్యారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ప్రతి నిరుపేద కష్టం తీరుతుందన్నారు. పెద్ద చదువులు చదివిన తమ పిల్లలకు జాబ్ లు లేక అవస్థలు పడుతున్నారని అంతకుముందు పలువురు మహిళలు సరోజ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సమస్యలు తీరుస్తామని వారికి ఆమె హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్నల్లాల భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ లీడర్లు సోత్తుకు సుదర్శన్,నోముల ఉపేందర్ గౌడ్,కడారి వీరస్వామి,సొత్తుకు రాజయ్య,బుర్ర రాజు గౌడ్,పోచంపల్లి లక్ష్మి, చంద్రకళ,రమాదేవి,సోతుకు ఉదయ్, ఆకుదారి శ్రీనివాస్, సూపర్ శ్రీనివాస్,బెల్లి నరసింహ,సాయి,సుంకరి ప్రకాష్ రావు, రావుల శ్రీనివాస్ కళ్యా డపు రాకే ష్, వెల్ది సాయి కృష్ణ, కళ్యాడపు కల్యాణ్, సొప్పరి రాజకుమార్ పాల్గొన్నారు.