ఆసక్తిగా సుమంత్ కొత్త మూవీ పోస్టర్..ఇంటెన్స్ పెంచుతున్న స్టోరీ థీమ్

ఆసక్తిగా సుమంత్ కొత్త మూవీ పోస్టర్..ఇంటెన్స్ పెంచుతున్న స్టోరీ థీమ్

అక్కినేని మనువడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హీరో సుమంత్(Sumanth). రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చిన సుమంత్..ఆ తర్వాత యువకుడు, సత్యం, గౌరీ,గోదావరి మూవీస్ తో ఆకట్టుకున్నాడు. మధ్యలో కొంత గ్యాప్ తీసుకుని మధుమాసం, మళ్ళీ రావా వంటి మూవీస్తో ఆకట్టుకున్నారు.

లేటెస్ట్గా సుమంత్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. వైవిధ్యభరితమైన కథలతో రావడం సుమంత్ కి..చాలా సినిమాలకి ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ అదే తరహాలో ఆడియాన్స్ ముందుకు వస్తున్నాడు. 

తన కొత్త సినిమా టైటిల్ లోగో ఆసక్తిగా ఉంది. 'మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) టైటిల్‌ ఫిక్స్ చేస్తూ పోస్టర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ మహేంద్రగిరిలో కొలువై ఉన్న వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్  జాగర్లపూడి సంతోష్‌. కథ నేపధ్యం ఉన్న సినిమా పడితే మంచి హిట్ కొట్టే సత్తా సమంత్లో ఉంది. ఎన్నో మూవీస్ లో తన నటనతో మంచి ప్రశంసలు అందుకున్నారు.  పోస్టర్ తోనే 'మహేంద్రగిరి వారాహి’ పై ఇంటెన్సిటీ పెంచిసిన సుమంత్..నిప్పు కాగడతో సినిమాపై అంచనాలు పెంచేశాడు. 

ఈ మూవీలో సుమంత్కు జోడీగా  మీనాక్షీ గోసామి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో  వెన్నెల’ కిశోర్, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్‌ కనకాల తదితరులు నటిస్తున్నారు.