
బుల్లితెర యాంకర్ అనసూయ మరోసారి గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఆమె నటిస్తున లేటెస్ట్ మూవీ విమానం. ఈ మూవీలో అనసూయ సుమతి అనే వేశ్యపాత్రలో కనిపించనుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి అనసూయ రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే సుమతి అనే సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సాంగ్ లో తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది అనసూయ. రెడ్ కలర్ సారీలో అనసూయ అందాలా విందు చేసింది.
మరీ ముఖ్యంగా సాంగ్ మొత్తం అనసూయ అందాలతో నింపేశారు. వేశ్య పాత్రకు తగ్గట్టుగానే ఆమె తన అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్న రాహుల్.. దొంగచాటుగా ఫోటోలు తీస్తూ ఆమె అందాన్ని వర్ణిస్తున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. ఇక ఈ సాంగ్ ను రాసింది, పాడింది.. మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ కావడం విశేషం. ఆయనరాసిన ప్రతి లిరిక్.. అనసూయ అందాన్ని కొలిచేవిధంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. జూన్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అనసూయకు ఎలాంటి హిట్ కొట్టనుందొ చూడాలి.