Sumaya Reddy: హీరోయిన్‌‌గా, నిర్మాతగా సుమయ రెడ్డి.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ‘డియర్ ఉమ’

Sumaya Reddy: హీరోయిన్‌‌గా, నిర్మాతగా సుమయ రెడ్డి.. అందరికీ కనెక్ట్ అయ్యేలా ‘డియర్ ఉమ’

సుమయ రెడ్డి హీరోయిన్‌‌గా, నిర్మాతగా, రచయితగా రూపొందించిన చిత్రం ‘డియర్ ఉమ’.పృథ్వీ అంబర్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించాడు. శుక్రవారం ఏప్రిల్ 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించారు.

సుమయ రెడ్డి మాట్లాడుతూ ‘తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకు వేసి సినిమాని నిర్మించాను. టీమ్ అంతా వారి డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకుని పనిచేశారు. మా సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. డియర్ ఉమ చిత్రం కాస్త ఫిక్షనల్. కాస్త రియల్. సోషల్ మెసెజ్ అని కాకుండా ఓ సొల్యూషన్‌ని కూడా చెబుతాం. అందరికీ అవగాహన కల్పించేలా చిత్రం ఉంటుందని’సుమయ రెడ్డి చెప్పింది.

ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని పృథ్వీ అంబర్ అన్నాడు. సమాజానికి ఈ సినిమా చాలా అవసరం అని  డైరెక్టర్ సాయి రాజేష్ మహదేవ్ అన్నాడు. నటుడు పృథ్వీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నితిన్ సాయి చంద్రారెడ్డి,  లైన్ ప్రొడ్యూసర్ నగేష్, లిరిసిస్ట్ పూర్ణాచారి పాల్గొన్నారు.