టెన్నిస్ లాంటి రాయల్ టోర్నీలో భారత ఆటగాళ్లు అర్హత సాధించడమే కష్టం. అయితే భారత కుర్రాడు సుమిత్ నాగల్ మాత్రం ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రౌండ్ లో సంచలన విజయం సాధించాడు. వరుస సెట్లలో వరల్డ్ నంబర్ 27 వ ర్యాంకర్, 31వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ ను చిత్తు చేసాడు. 6-4, 6-2, 7-6 [7-5]తో వరుస సెట్లలో బుబ్లిక్ కు షాకిచ్చాడు. బుబ్లిక్ పై తొలి సెట్ నుంచే సుమిత్ ఆధిపత్యం చెలాయించాడు. మొదట్లోనే అతని రెండు సర్వీసులను బ్రేక్ చేసి మ్యాచ్ పై పట్టు బిగించాడు.
రెండో సెట్ ఈజీగానే సొంతం చేసుకున్నా.. మూడో రౌండ్లో మాత్రం ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరూ పోటాపోటీగా ఆడటంతో మ్యాచ్ టై బ్రేక్ కు దారి తీసింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ సెట్ లో నాగల్ జోరు ముందు బుబ్లిక్ కుదేలయ్యాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్ ను సుమిత్ ఓడించడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో సోమ్‌దేవ్ దేవ్ వర్మన్ తర్వాత రెండో రౌండ్ చేరిన తొలి ఇండియన్ ప్లేయర్ గా కూడా సుమిత్ నిలిచాడు.
రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న సుమిత్.. ప్రస్తుతం ప్రపంచంలో 139వ ర్యాంకులో ఉన్నాడు. గ్రాండ్ స్లామ్ టోర్నీలో సీడెడ్ ప్లేయర్ ను ఓడించిన రెండో ఇండియన్ గా నిలిచాడు. గతంలో 1989లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో అప్పటి వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాట్స్ విలాండర్ ను ఇండియాకు చెందిన రమేష్ కృష్ణన్ ఓడించాడు.
Sumit Nagal pic.twitter.com/W8RGtWhT4P
— RVCJ Media (@RVCJ_FB) January 16, 2024