
సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో భారత స్టార్ ప్లేయర్ సుమిత్ నాగల్ తొలి రౌండ్ లోనే ఇంటిదారి పట్టాడు. యూఎస్ ఓపెన్‌లో భారత్ తరపున ఆడుతున్న మెన్స్ సింగిల్స్ ఆడుతున్న ఒకే ఒక్క ప్లేయర్ సుమీత్ నాగల్. ప్రస్తుతం ప్రపంచ 737 వ స్థానంలో ఉన్న ఈ ఇండియన్ స్టార్ తొలి రౌండ్ లో 40 వ ర్యాంక్ కు చెందిన టాలన్ గ్రీక్స్‌పూర్‌తో వరుస సెట్లలో ఓడిపోయాడు. సోమవారం (ఆగస్టు 26) అర్ధ రాత్రి ముగిసిన ఫైనల్లో నాగల్ 1-6, 3-6, 6-7 తో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు.
రెండో సీడ్ నోవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్ లో అల్బోట్ పై 6-2,6-2,6-4 తేడాతో వరుస సెట్లలో గెలిచాడు. నాలుగో సీడ్ అలెగ్జాండ్ జ్వెరెవ్ తొలి రౌండ్‌లో జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 6–7 (5/7), 6–3, 6–2తో తమ దేశానికే చెందిన మాగ్జిమిలియన్ మార్గెనర్‌ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో 17వ సీడ్ యుగో హంబర్ట్ (ఫ్రాన్స్) 6–3, 6–4, 6–4తో తియాగో (బ్రెజిల్)పై గెలిచాడు.
విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఏడో సీడ్ జెంగ్ (చైనా) 4–6, 6–4, 6–2తో అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవాను ఓడించింది. మరో మ్యాచ్‌లో 12వ సీడ్ రష్యా ప్లేయర్ డారియా కసట్కినా 6–2, 6–4తో జాక్వెలిన్ క్రిస్టియాన్ (రొమేనియా)ను ఓడించగా, 24వ సీడ్ వెకిచ్ (క్రొయేషియా) 6–4, 6–4తో బిరెల్ (ఆస్ట్రేలియా), 27వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 3–6, 6–3, 6–4తో కార్లీ (అర్జెంటీనా)పై గెలిచింది. గ్రీస్ స్టార్ మరియా సకారి.. చైనాకు చెందిన వాంగ్ యఫన్‌తో పోరులో 2–6తో తొలి సెట్ కోల్పోయిన తర్వాత భుజం గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకుంది.
Not a memorable match for sumit nagal!! #USOpen2024 pic.twitter.com/fQ6mgtdlBR
— Sport in a nutshell (@Shuvo10976159) August 27, 2024