
న్యూఢిల్లీ : ఇండియా స్టార్ ప్లేయర్ సుమిత్ నగాల్.. మళ్లీ డేవిస్ కప్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వరల్డ్ గ్రూప్–1లో భాగంగా వచ్చే నెల 14, 15న స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండనున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో గ్రాస్ కోర్టుపై జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్న నగాల్.. ఇప్పుడు హార్డ్ కోర్టుపై పోటీలు కావడంతో మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. అయితే యూకీ బాంభ్రీ ఈ మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నాడు.
రామ్‌కుమార్ రామనాథన్, ఎన్. శ్రీరామ్ బాలాజీ, నిక్కీ పూనచ జట్టులోని మిగతా సభ్యులు కగా అర్యన్ షా రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. మాజీ నేషనల్ చాంపియన్ సిద్ధార్థ్ విశ్వకర్మ కొత్త కోచ్‌గా వ్యవహరించనున్నాడు. యూకీ అందుబాటులో లేకపోవడంతో రామ్‌కుమార్‌ను సింగిల్స్, డబుల్స్‌లోనూ ఆడించే చాన్స్ ఉంది. అందుబాటులో ఉండే ప్లేయర్లతో మంచి టీమ్‌ను ఎంపిక చేస్తామని సెలెక్షన్ కమిటీ చైర్మన్ నందన్ బాలా వెల్లడించారు.