హైదరాబాద్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సమ్మెటివ్ అసెస్మెంట్(ఎస్ఏ–1) పరీక్షలకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న స్టూడెంట్లకు ఎస్ఏ1 పరీక్షలు నవంబర్1 నుంచి ప్రారంభమవుతున్నాయి. మరోవైపు నవంబర్ 3న మునుగోడు ఎన్నిక పోలింగ్ జరగనుంది. దీంతో దాదాపు అన్ని స్కూళ్లలో పోలింగ్ కోసం స్కూళ్లను ఒకరోజు ముందే అధికారులు హాండోవర్ చేసుకుంటారు. టీచర్లకూ ఎన్నికల డ్యూటీలు పడే అవకాశముంది. దీంతో ఎస్ఏ 1 పరీక్షలు ఉంటాయా పోస్ట్ పోన్ చేస్తారా అనేదానిపై ఎస్సీఈఆర్టీగానీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గాని స్పష్టత ఇవ్వట్లేదు. దీంతో జిల్లా అధికారుల్లో అయోమయం నెలకొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాల్సిన పరీక్ష కావడంతో, క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. మరోపక్క టెన్త్లో 11 పేపర్లను 6 కు కుదించిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. మునుగోడు పోలింగ్ తేదీలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తొలి 3 పరీక్షలను ఆ నియోజకవర్గం పరిధిలోని స్కూళ్లకు మినహాయించాలని.. లేదంటే, అన్ని స్కూళ్లకు నవంబర్ 4 నుంచి ఎస్ఏ1 పరీక్షలు పెట్టాలని హెడ్మాస్టర్లు కోరుతున్నారు.