కరీంనగర్ క్రైం, వెలుగు : పిల్లలు చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యమిచ్చేలా పేరేంట్స్ కృషి చేయాలని సీపీ అభిషేక్ మహంతి సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పిల్లలకు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.
క్యాంపు రెండు వారాలపాటు కొనసాగుతుందని, దీనిలో డ్రాయింగ్ , పెయింటింగ్ , డ్యాన్స్ , సింగింగ్ , అథ్లెటిక్స్ , కరాటే, ఫుట్ బాల్ , క్రికెట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. అడిషనల్ డీసీపీ(లా అండ్‌ఆర్డర్) ఎ.లక్ష్మీనారాయణ , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సురేష్ , శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.