సమ్మర్ క్యాంపులు షురూ.. 497 మైదానాల్లో 44 క్రీడలపై కోచింగ్ ఇవ్వనున్న బల్దియా

సమ్మర్ క్యాంపులు షురూ.. 497 మైదానాల్లో 44 క్రీడలపై కోచింగ్ ఇవ్వనున్న బల్దియా
  • వచ్చే నెలాఖరు వరకు కొనసాగనున్న క్యాంపులు
  • ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  జీహెచ్ఎంసీ ఏటా ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపులు శుక్రవారం నుంచే షురూ అయ్యాయి. ఏప్రిల్ 25 వరకు సిటీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ అమల్లో ఉండడంతో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ముందుగా నిర్ణయించే తేదీ ప్రకారమే అధికారులు ప్రారంభించారు. మొత్తం 497 మైదానల్లో 44 క్రీడాంశాలపై 6 నుంచి 16 ఏండ్ల పిల్లలకు కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ క్యాంపుల కోసం ప్రత్యేకంగా 997 మంది హానరరీ కోచ్ లను తీసుకున్నారు. ఈ ఏడాది 60 వేల మంది వరకు శిక్షణ కోసం వచ్చే అవకాశముందని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. శిక్షణ పూర్తయిన తరువాత స్టూడెంట్లకు ప్రశంసా పత్రాలు అందించనున్నారు. 

రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..

సమ్మర్ క్యాంపులకు సంబంధించి అప్లికేషన్లను ఆన్ లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్ లైన్​లో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే గ్రౌండ్ ఇన్ స్పెక్టర్లను కలిసి మ్యాన్ వల్ గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.  ఆసక్తి గల విద్యార్థులు  https://sports.ghmc.gov.in వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ క్యాంపుల్లో పాల్గొనే వారు జీహెచ్ఎంసీ  పోర్టల్ లో నమోదు చేసుకొని  ఫీజు చెల్లించాల్సి ఉంది.  

ఈ క్రీడలపైనే శిక్షణ

సమ్మర్ క్యాంపుల్లో భాగంగా అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా, నెట్ బాల్, రోలార్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికైట్, థైక్వాండో, తగఫ్ వార్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెస్లింగ్ఇండియన్, రెస్లింగ్రోమన్, వూషు, యోగా, త్రో బాల్, కిక్ బాక్సింగ్, మయ్ థాయ్, స్కే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్, క్యారమ్స్ గేమ్స్​ పై కోచింగ్ 
ఇవ్వనున్నారు.