ఈసారీ సమ్మర్ క్యాంపులు లేనట్లేనా?

ఈసారీ సమ్మర్ క్యాంపులు లేనట్లేనా?
  • కరోనా ఎఫెక్ట్​తో రెండేళ్లుగా ఏర్పాటు చేయని బల్దియా
  • కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా క్లారిటీ ఇవ్వని ఆఫీసర్లు
  • ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ నుంచి అప్రూవల్​ కోసం వెయిటింగ్

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్​తో జీహెచ్ఎంసీ ఏటా నిర్వహించే సమ్మర్ ​క్యాంపులకు రెండేళ్లుగా బ్రేక్​పడింది. 
పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టడంతో ఈసారైనా నిర్వహిస్తారా? లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కమిషనర్ లోకేశ్​కుమార్ గ్రీన్ సిగ్నల్​ ఇచ్చినప్పటికీ ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ఆఫీసర్లు స్పష్టత ఇవ్వట్లేదు. సమ్మర్​క్యాంప్​లు పెట్టాలంటే క్రీడా పరికరాలు కొనాల్సి ఉంది. రెండేళ్లుగా నిర్వహించకపోవడంతో క్రీడా పరికరాలు పూర్తిస్థాయిలో లేవు. కొత్తవి కొనాలంటే  ఖర్చుతో కూడుకున్న పని అని ఆఫీసర్లు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఫైనాన్స్ విభాగం నుంచి అప్రూవల్ వస్తే తప్ప క్యాంపులకు సంబంధించిన ఫైల్​ స్పోర్ట్స్​ విభాగం నుంచి మూవ్ అయ్యేలా కనిపించడం లేదు.

ఫుల్ ​డిమాండ్

కరోనా కారణంగా పిల్లలు రెండేళ్లుగా ఆటలకు దూరమయ్యారు. అప్పుడప్పుడు స్కూల్స్ ఓపెన్​అవుతున్నా క్రీడలకు దూరంగా ఉంటున్నారు. దీంతో గతంలో క్రీడల్లో ఎంతో ప్రతిభ కనబరిచినవారు కూడా వెనుకబడిపోయారు. ఈసారి సమ్మర్ క్యాంప్​లు నిర్వహిస్తే అలాంటి వారికి ఎంతో ఉపయోగపడతాయి. గతంలో జీహెచ్‌‌ఎంసీ నిర్వహించిన శిక్షణా శిబిరాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వాటిల్లో కోచింగ్ తీసుకుని నేషనల్, ఇంటర్​నేషనల్ ​స్థాయిలో రాణించిన వారెందరో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జీహెచ్‌‌ఎంసీ సమ్మర్‌‌ క్యాంపులకు ఫుల్ డిమాండ్‌‌ ఉండేది. క్యాంప్​ల్లో  సీనియర్‌‌ కోచ్‌‌లతో శిక్షణను ఇచ్చేవారు. ఉత్తమ ప్రతిభ చూపే క్రీడాకారులను ఎంపిక చేసి, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు కూడా పంపించేవారు.

2019లో 730 సెంటర్లు

జీహెచ్ఎంసీ 2019లో గ్రేటర్​ పరిధిలో 730 సెంటర్లు ఏర్పాటు చేసి 45 క్రీడలకు సంబంధించి కోచింగ్​ ఇప్పించింది. వాటిలో అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్‌‌ బ్యాడ్మింటన్, షటిల్‌‌ బ్యాడ్మింటన్, బాస్కెట్‌‌బాల్, బేస్‌‌ బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, చెస్, క్యారమ్స్, క్రికెట్, సైక్లింగ్, ఫుట్‌‌బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌‌బాల్, హాకీ, జుడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కిక్‌‌ బాక్సింగ్, మల్లఖంబ, నెట్‌‌బాల్, రోలర్‌‌ స్కేటింగ్, రైఫిల్‌‌ షూటింగ్, సెపక్‌‌ తక్ర, సాఫ్ట్‌‌బాల్, టెన్నిస్, టేబుల్‌‌ టెన్నిస్, తైక్వాండో, టెన్నికాయిట్, టగ్‌‌ ఆఫ్‌‌ వార్, త్రోబాల్,  వాలీబాల్, వెయిట్‌‌ లిఫ్టింగ్, రెజ్లింగ్‌‌ ఇండియా, వెస్లింగ్‌‌ రోమన్, ఉషు, యోగా, క్రాఫ్‌‌ బాల్, పవర్‌‌ లిఫ్టింగ్, బీచ్‌‌ వాలీబాల్, స్కై మార్షల్‌‌ ఆర్ట్స్‌‌పై శిక్షణ ఇప్పించింది. అప్పట్లో వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని వార్తల కోసం..

ఆధార్ కార్డ్‌‌‌‌లో  ఫొటో మార్చండి ఇలా...

సైన్యంలో చేరి నా మనవళ్లను కాపాడుకుంటా

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్