
ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత.. చెమట రూపంలో శరీరంలోని నీరంతా బయటకు వచ్చి డీహైడ్రేషన్ కు గురయి నీరసానికి గురవుతాయి. ఇంకా వడదెబ్బ తగిలి డయోరియా వంటి సమస్యలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతారు. వీటినుంచి బయటపడాలంటే జనాలు చల్లటి పానీయాలు తాగుతారు.. ఇవి ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా ఉపశమనం కోసం తాగుతారు. కాని నిత్యం కిచెన్ లో ఉండే టమాటాలతో జూస్ చేసుకుని తాగితే ఎంతో ఆరోగ్యం.. సమ్మర్ డ్రింక్‌గా పని చేస్తుంది. అలాంటి జ్యూస్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం!
టమాటా జూస్ తయారీకి కావలసిన పదార్థాలు:
- టమోటో: 200 గ్రాములు
- క్యారెట్ తురుము : అర కప్పు
- పంచదార: 1 కప్పు
- నిమ్మరసం: తగినంత
- మిరియాల పొడి: చిటికెడు
- నీళ్లు: తగినంత
తయారు చేయు విధానము: మిక్సీలో టమాటా తురుము.. పంచదార.. క్యారట్ తురుము.. నిమ్మరసం.. తగినన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గ్లాసుల్లో పోసి, వెంటనే సర్వ్ చేయాలి. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్ వేసవి తాపాని తీర్చుతుంది. శరీరానికి చల్లదనం అందిస్తుంది.
Also Read :- ఉగాది పండుగ ఎప్పుడు.. కొత్త సంవత్సరం పేరు ఇదే..!
టమోటా జ్యూస్ ఉపయోగాలివే..
- టమోటాలలో సోడియం ఉంటుంది. అది ఎలక్ట్రోలైట్ లలో ఒకటి. కండరాల మరమ్మత్తులకు, సెల్ కమ్యూనికేషన్ కు అవసరం.
- టమోటాలలో ఉండే సోడియం కండరాల సమస్యలకు.. సెల్ కమ్యూనికేషన్లో వచ్చే అంతరానికి చెక్ పెడుతుంది. ఇది ఎలక్ట్రో లైట్పదార్దాలలో ఒకటి.
- లైకోపీన్, బీటా కెరోటిన్, గామా కెరోటిన్ మొదలైనవి టమోటాలో ఉంటాయి. ఇవి గుండె సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
- బరువు తగ్గేందుకు టమోటా జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక శరీరంలో కొవ్వు కరిగించే లక్షణం దీనికి ఉంటుంది.
- ఖాళీ కడుపుతో టమోటా జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల శోషణ పెరుగుతుంది.
- టమోటా జ్యూస్ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. శరీరంలో విషాలు తొలగించడంలో సహాయపడుతుంది.
- జీర్ణ ఎంజైమ్ లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల టమోటా జ్యూస్ జీర్ణవ్యవస్థకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.