విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 11 వరకు సెలవులే సెలవులు..

విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 11 వరకు సెలవులే సెలవులు..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బడులకు గురువారం (ఏప్రిల్ 24) నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 11 వరకూ సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకులాల స్కూళ్లన్నీ మూతపడనున్నాయి. జూన్12న 2025–26 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్నది. కాగా, 2024–25 అకాడమిక్ ఇయర్ బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా టీచర్లు పేరెంట్స్ తో సమావేశాలు నిర్వహించారు. స్టూడెంట్లకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. కాగా, సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని అధికారులు స్కూల్ యాజమాన్యాలను హెచ్చరించారు.