ఉత్తరాదిన మండుతున్న ఎండలు.. 21 నగరాల్లో హై టెంపరేచర్

ఉత్తరాదిన మండుతున్న ఎండలు..  21 నగరాల్లో హై టెంపరేచర్

ఉత్తరాది వేడెక్కుతోంది.  అపుడే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ముఖ్యంగా  ఢిల్లీ, రాజస్థాన్ ,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వీటితో పాటు ఒడిశాలో ఎండలు మండుతున్నాయి. 

ఈ ఐదు  రాష్ట్రాలలోని 21 నగరాల్లో ఏప్రిల్ 6న  42 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీ రాబోయే మూడు రోజులు వేడిగాలులతో వీచే అవకాశం ఉంది.  ఢిల్లీతో పాటు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్  ఒడిశాలోని నగరాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

ఏప్రిల్ మొదటి వారంలో ప్రతి నగరంలో మూడు డిగ్రీల నుంచి 6.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.  ముఖ్యంగా ఢిల్లీలో గాలి వేగం తగ్గడం వల్ల ఎండలు ఎక్కువయ్యాయి.  ఉదయం గాలి వేగం గంటకు 8-10 కి.మీ. ఉండగా.. ఆ తర్వాత  క్రమంగా తగ్గుతోంది. మధ్యాహ్నం సమయంలో ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4-6 కి.మీ. వేగంతో పెరుగుతుంది.  సాయంత్రం,  రాత్రి సమయంలో ఆగ్నేయ దిశ నుంచి గంటకు 8 కి.మీ. కంటే తక్కువగా పెరుగుతుంది  అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్‌లోని బార్మెర్‌లో  ఎండలు  కొత్త రికార్డులను సృష్టించాయి. ఏప్రిల్ 6న  గరిష్ట ఉష్ణోగ్రత 45.6 డిగ్రీల సెల్సియస్ -నమోదయ్యింది. ఏప్రిల్ మొదటి వారంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇది. 

ఏప్రిల్ 6- నుంచి10 తేదీలలో గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది. ఇదే  సమయంలో  రాజస్థాన్‌లో కూడా వేడిగాలులు వీచే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్ , పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఏకాంత ప్రాంతాల్లో వేడిగాలుల పరిస్థితి ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.