
వాతావరణం మారింది. ఎండలు మండలు మండులున్నాయి. సూర్యుడు సుర్రుమంటున్నాడు. వాతావరణం ఛేజింగ్ .. వ్యాధులు.. వైరస్ లు విజృంభించే సమయంగా మారుతుంది. ఇక ఎండాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, శరీరంలో కూడా మార్పులు వస్తాయి. దాంతో అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే వ్యాధుల్లో నీళ్ల విరేచనాలు ఒకటి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఈ వ్యాధి అందరికి వస్తుంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా దీని నుంచి బయటపడొచ్చు.
కలుషిత నీళ్లు తాగడం... ఆహారం తినడం వల్ల నీళ్ల విరేచనాలు అవుతాయి. శుభ్రంగా చేతులు కడుక్కోకపోవడం వల్ల ఎక్కువగా దీని బారినపడతారు. ఎండాకాలంలో సహజంగానే శరీరం వేడిగా ఉంటుంది. ఎక్కువగా తిరిగితే అలసిపో తుంది. చెమట రూపంలో నీళ్లు శరీరం నుంచి బయటకు పోతుంటాయి. అందువల్ల తినే ఆహారంపై, తాగే నీళ్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
ఇవి కనిపిస్తాయి
ఈ వ్యాధి రోటా, అస్ట్రో, నార్ వ్యాక్, పికోర్నా లాంటి వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ లు సోకితే విరేచనాలు ఎక్కువగా అవుతాయి. వీటితో పాటు కొందరిలో వాంతులు అయ్యే అవకాశం ఉంది. తక్కువ ఉష్ణోగ్రతలో జ్వరం వస్తుంది. కొందరిలో విరేచనాలతోపాటు రక్తం కూడా పడొచ్చు. కడుపులో వికారంగా ఉంటుంది. పొట్ట నొప్పి వస్తుంది.
ALSO READ | Holy 2025: రంగుల పండుగ.. పురాణాల సారాంశం ఇదే.. రాధా.. కృష్ణులు హోలీ ఆడారట..!
ఏదీ తిన బుద్ధి కాదు. ఏం తిన్నా, వెంటనే విరేచనం అవుతుంది. పెద్దవాళ్లలో ఈ వ్యాధి రెండు నుంచి నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది. పిల్లల్లో అయితే ఐదు నుంచి ఏడు రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. శరీరం నిస్పత్తువుగా మారిపోతుంది. ఓపిక ఉండదు. ఒకటి రెండు రోజుల్లో తగ్గకపోతే తప్పనిసరిగా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి.
పిల్లల్లో..
వేసవికాలంలో పిల్లలకు వచ్చే వ్యాధుల్లో నీళ్ల విరేచనాలు చాలా ప్రమాదం. సహజంగానే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనదే శంలో ప్రతి ఏటా మూడు లక్షల మంది చిన్నా రులు నీళ్ల విరేచనాల వల్ల చనిపోతున్నారు. డయేరియాకు గురైన ప్రతి 200 మంది పిల్లలో ఒకరు మరణిస్తున్నారు.
ALSO READ | ఆధ్యాత్మికం : భగవంతుడికి ఎలాంటి పుష్పాలు సమర్పించాలో తెలుసా..!
తాగే నీళ్లు శుభ్రంగా లేకపోవడం. ఇంట్లో టాయిలెట్స్ పరిశుభ్రం గా ఉంచుకోకపోవడం, బయట పదార్థాలు తినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. నీళ్ల విరేచనాల వల్ల బాగా నీరసపడతారు. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. పోషకాలు, లవణాలు శరీరం నుంచి బయటకుపోతాయి. ఈ సమయంలో పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే, పోషకాలతో నిండిన ఆహారపదార్ధాలు ఇవ్వాలి. వేడిగా, శుభ్రంగా ఉండే పదార్థాలు మాత్రమే ఇవ్వాలి. తినడానికి ఇబ్బంది పడుతుంటే ద్రవ పదార్ధాలు ఇవ్వాలి.
జాగ్రత్తలు
- బయట అమ్మే పండ్ల రసాలు, కూల్ డ్రింకులు, ఐస్ కలిపిన పానీయాలు తాగకూడదు.
- పచ్చి కూరగాయలకు బదులు ఉడక బెట్టినవి తినాలి
- పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా కడిగి వాడాలి.
- గ్యాస్ట్రిక్ సమస్యలు తెచ్చిపెట్టే ఆహారం వేసవిలో తీసుకోకూడదు.
- కెఫిన్ ఉండే ఆహారపదార్ధాలను తగ్గించుకోవాలి.
- మూత్ర, మల విసర్జన తర్వాత, అన్నం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
- కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి.
- విరేచనాలు అవుతున్నప్పుడు ఓఆర్ఎ స్ ద్రవాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
- కాచి చల్లార్చిన నీళ్లలో కొద్దిగా ఉప్పు, చక్కెర వేసి తాగితే మంచిది.
- మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తగినంత శక్తి అందుతుంది
-–వెలుగు, లైఫ్–