
ఎండా కాలం వచ్చింది. పిబ్రవరిలో ఎండలు మొదలవ్వగా.. శివరాత్రి దాటగానే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇంకా ముందుంది ముసళ్ల పండగ అన్న చందంగా.. భానుడి ప్రచండాన్ని తట్టుకోవాలి. ఎప్పుడో చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొనేకంటే.. సమ్మర్ సీజన్ లో మంచినీళ్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంకా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. .
ఎండాకాలం వచ్చేస్తోంది. పోయిన సంవత్సరం ఎండల సంగతి గుర్తుంది కదా. మరీ సూర్యుడు. ఎదురొచ్చేదాకా ఉండటం కంటే ఎండాకాలం పూర్తిగా రాకముందే కొన్ని జాగ్రత్తలని పాటించుకుంటూ ఉండాలి . ముందు జాగ్రత్తగా ఎండాకాలాన్ని ఎదుర్కొనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఎండ వేడి నుంచి రక్షణ పొందాలంటే. ప్రధానంగా ఇంటి వాతావరణం చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల వాటర్ తాగటం మంచిది. టైట్ దుస్తులు ధరించకుండా.. వదులుగా ఉండే వస్త్రాలు ఎంచుకోవడం బెటర్.. ఇక తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేలా ఆహారం తీసుకోవాలి.
- ముఖ్యంగా ఎండాకాలంలో చాలామంది డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. దాని నుంచి బయటపదాలంటే.. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మరసం, మజ్జిగ తాగడం బెటర్.
- అలాగే సంద్రజ్యూస్, కొబ్బరి నీళ్లు తాగడం కూడా మంచిదే. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే... కచ్చితంగా ముఖానికి, తలకు గుడ్డ కట్టుకోవడం మరచిపోవద్దు. అలాగే గొడుగు తీసుకెళ్లడం. కళ్లకు స్పెట్స్ పెట్టుకోవడం మంచిది.
- సమ్మర్ లో పడవెబ్బ చాలా రేంజరస్. వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ తగలకుండా తప్పించుకోవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా. వెంట వాటర్ బాటిల్ ఉండేలా చూసుకోండి రెగ్యులర్ గా వాటర్ త్రాగాలి.
- వేసవికాలంలో ఆల్కహాల్, సిగరెట్, కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వాటివల్ల శరీ ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్సుంది. ఎండలో ఎక్కువగా తిరుగుతుంటే సూర్యరశ్మి తగిలి వడదెబ్బ తాకే ఛాన్సుంది. దాంతో వాంతులు. అలసట, తలనొప్పి, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె సంబంధిత, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఎండలో తిరగకపోవడమే బెటర్.
- ఎండాకాలం ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాల్సిందే. వాతావారణంలో ఉష్ణోగ్రతలు పెరిగితే పిల్లల బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంటుంది. కాబట్టి చిన్నపిల్లల విషయంలో మరికొంత కేర్ తీసుకుంటే మంచిది.