
సమ్మర్ కాక రేపుతుంది. ఎండాకాలంలో హీట్ నుంచి బాడీని రక్షించుకోవాలి. అంతే కాదు మనం తినే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండా కాలంలో ఎలాంటి ఫుడ్ తినకూడదు.. తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. . .
వేసవిలో ఎండ నుంచే కాకుండా. ..ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఎండ ప్రభావాన్ని పెంచుతాయి. పుచ్చకాయ, దోసకాయ లాంటివి మేలు చేస్తే, మరికొన్ని వేడిని పెంచుతాయి. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. వేసవిలో ప్రధానంగా ఆరు రకాల ఆహార పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చికెన్, ఫిష్, మటన్ వంటి మాంసాహారం ఏదైనా ఎక్కువ చెమట పట్టేందుకు కారణమవుతాయి. అందుకే వీలైనంత తక్కువగా మాంసాహారం తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కొన్నిసార్లు జీర్ణ సంబంధిత సమస్యలొచ్చి, డయేరియా కూడా రావొచ్చు. మసాల ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోకూడదు. వీటితోపాటు ఆయిల్ ఫుడ్, ఫ్రైడ్‌ఫుడ్ కూడా తినకూడదు. ఇవి వేడిని కలిగించి డీ హైడ్రేషన్‌కు కారణమవుతాయి.
ALSO READ : కిచెన్ తెలంగాణ ఈ రెసిపీలు మ్యాంగో ఫ్లేవర్!
ఉప్పు, ఆయిల్ ఎక్కువగా ఉండే ప్యాకేజ్డ్ స్నాక్స్ తినకూడదు. వీటి బదులు పండ్లు, కూరగాయల ముక్కలు తీసుకోవాలి. వీటితోపాటు వివిధ రకాల సాస్ తో చేసే పదార్థాలు అస్సలు తినకూడదు. దీని వల్ల ఆహారం అరగకపోవడం, గ్యాస్ ట్రబులవంటివి వేసవిలో ఎక్కువగా వస్తాయి. అంతకుమించి ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. దీని వల్ల బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కోక్, కెఫైన్ డ్రింక్స్ బదులు చక్కెర కలపని సహజమైన పండ్ల రసాలే తాగాలి. వేసవిలో అనవసరంగా అనారోగ్యాన్ని కొనితెచ్చుకోకూడదంటే ఈ నియమాలు పాటించాల్సిందే..