
మిగిలిన కాలాలతో పోలిస్తే.. ఎండాకాలంలో జుట్టు సమస్యలు ఎక్కువనే చెప్పొచ్చు. వేసవికాలంలో చెమట వల్ల వెంట్రుకలు పొడిగా, నిర్జీవంగా మారి చిట్లిపోతాయి. చెమట వల్ల మాడుపై చుండ్రు వచ్చి జుట్టు ఊడిపోతుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే ఇలా చేయండి.
కాలుష్యం వల్ల జట్టులో పేరుకుపోయిన మురికిని, కాలుష్య కారకాలను తొలగించాలంటే వారంలో రెండుమూడు సార్లు తలస్నానం చేయాలి. అరగంట ముందు తలకు కొబ్బరి నూనె బాగా పట్టించి ఆ తరువాత తలస్నానం చేయాలి. నాణ్యమైన, తక్కువ గాఢత ఉండే షాంపూలనే ఎందుకోవాలి, జుట్టులోని తేమని కోల్పోకుండా చివర్లు చిట్లకుండా, ఎండిపోయి గడ్డిలా మారకుండా చేస్తాయి.
సహజత్వాన్ని కోల్పోతుంది: కొందరు ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటారు. దానివల్ల వెంట్రుకలు పొడిబారి జుట్టంతా పీచులా మారుతుంది. తరచూ షాంపూతో తలస్నానం చేయడం.. నల్ల జుట్టు సహజరంగుని కోల్పోతుంది. గోధుమరంగులోకి మారుతుంది. మెరుపు తగ్గిపోతుంది. దీనికి తోడు తలపై చర్మం పొడి బారి పొలుసులు పొలుసులుగా ఊడుతుంది. తల్లోని సహజనూనెలు ఆవిరవుతాయి.
జుట్టుని ఆరబెట్టాలి: తలస్నానం చేశాక ఒక్కోసారి జుట్టు ఆరబెట్టుకోవడానికి తగిన సమయం ఉండదు. అలానే జుట్టు అల్లుకుని వెల్లిపోతారు. ఇలా చేయడం పల్ల బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ పెక్షన్లు ఏర్పడతాయి. అందుకే జుట్టుని బాగా ఆరబెట్టుకున్నాకే అల్లాలి
తలే ముఖ్యం : ఆరోగ్యకరమైన జుట్టును కుదుళ్ల నుంచే రక్షించుకోవాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, స్కార్ఫ్, స్టోల్ చుట్టుకోవాలి. హెయిర్ స్పా ట్రీట్ మెంట్ చేయించుకుంటే జుట్టు సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. అలాగే తలకు ఉపయోగించే దువ్వెనలు, బ్రష్ లను తరచూ వేడినీళ్లలో కడగాలి. ఒకరు వాడిన దువ్వెనను మరొకరు వాడకపోవడం మంచిది.
స్టైలింగ్ పరికరాలు వాడుతుంటే
హెయిర్ స్టైల్స్ కోసం బ్లో డ్రయ్యర్, సైయిట్ సర్... కర్లర్ లాంటివి వాడుతుంటారు. అయితే వీటిని సరైన పద్ధతిలో వాడకపోతే జుట్టు చిట్లడం, పొడిబారడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. తలస్నానం చేసి రాగానే బోడ్రయ్యర్ వాడొద్దు... కాస్త గాలికి ఆరాక వాడాలి. దీనివలన జుట్టుపై వేడి ప్రభావం అంతగా ఉండదు. అలాగే స్ట్రెయిట్ నర్, కర్లర్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా కండీషనర్, హెయిర్ ప్రొటక్షర్ సిరమ్ జుట్టుకి వాడాలి.
ప్రత్యేక సందర్భాల్లో :ప్రత్యేక వేడుకలున్నప్పుడు కొత్త ఉత్పత్తులకు. డ్రైలకు దూరంగా ఉంచటం మంచిది. అవి పడకపోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది. కలర్ వేసుకునేటప్పుడు అమోనియా లేనివే ఎంచుకోవాలి. రంగు వేసుకునే ముందు ఇతర రసాయన ఉత్పత్తులేవి వాడకూడదు. రెండు మూడు రోజులు తలస్నానం చేశాక రంగు వేసుకోవాలి.
హెయిర్ సీరమ్ : వేసవిలో జుట్టుకి నూనె రాసుకోవడానికి బదులు హెయిర్ సీరమ్ ని వాడొచ్చు, ఇది తక్కువ నూనె కలిగి ఉండటంతో పాటు తలకు పెద్దగా అంటుకోదు. అలాగే వేసవిలోని జుట్టు సంరక్షణకు ఉపయోగపడే కెరటిన్, అలోవెరా ఉత్పత్తులనే వాడాలి.
జుట్టుకి స్పా : జుట్టుకి పోషణ అందించే హెయిర్ స్పాని ఇంట్లో కూడా ప్రయత్నించి మంచి ఫలితాలు పొచ్చు. పాలు, బొప్పాయి, పెరుగు, అలివ్ ఆయిల్. లాంటి వాటితో హెయిర్ ప్యాక్లు వేసుకొని జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు
ఇవి తింటే చాలు
- చేపల్లో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. జుట్టుకు పోషణ
- అందించే ఒమెగా3, ఫ్యాటీ ఆమ్లాలు కూడా వీటి నుంచే లభిస్తాయి. గుడ్డులో జింక్, సల్ఫర్, ఐరన్, సిలీనియం లాంటి మూలకాలుంటాయి. ఇవి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- బాదం, వాలఖ నట్, జీడిపప్పులో కూడా ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. అలాగే వీటిలోని విటమిన్'ఇ', బయోటిన్లు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి.
- ఆకుకూరలు జుట్టు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తాయి. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అది వెంట్రుకలు చిట్లకుండా ఆపుతుంది.
- క్యారెట్లో ఉండే విటమిన్ ఎ కూడా జుట్టుకి చాలా మంచిది.
- అలాగే మీగడ తీసిన పాలు, చీజ్ కూడా వెంట్రుకలు చిట్లిపోకుండా కాపాడతాయి.