
- చెన్నూరు నియోజకవర్గ అభివృద్దిపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రివ్యూ
మంచిర్యాల:చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిపనులపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్దికి తీసుకోవాల్సిన చర్య లపై అధికారులతో చర్చించారు. ఎండాకాలం ప్రారంభమైనందున తాగునీటి సమస్యలకు చెక్ పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జైపూర్ పవర్ ప్లాంట్ లోని గెస్ట్ హౌస్ లో కలెక్టర్ దీపక్ కుమార్ ఇతర అధికారులతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ pic.twitter.com/GF0eNqb4Ud
— Dr Vivek Venkatswamy (@VivekVenkatswam) March 7, 2025
ఎండాకాలం వస్తున్నందున నియోజకవర్గంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జైపూర్ పవర్ ప్లాంట్ లోని గెస్ట్ హౌస్ లో కలెక్టర్ దీపక్ కుమార్తో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.