
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వేసవి సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ సందర్భంగా చర్లపల్లి– దానాపూర్ మధ్య ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 3.20 గంటలకు (నెం.07419) ట్రెయిన్ బయలుదేరి వెళ్తుందన్నారు. అలాగే 21 నుంచి 28 వరకు దానాపూర్నుంచి చర్లపల్లికి ఉదయం11.40 గంటలకు చేరుకుంటుందని రైల్వే చీఫ్ పబ్లిక్రిలేషన్స్ఆఫీసర్ఎ. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రత్యేక రైలు కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్లార్ష, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, జబల్పూర్, కత్ని, సత్నా, మాణిక్పూర్, ప్రయాగ్‌రాజ్, చియోకీ, పండిత్దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బుక్సార్, అరాస్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగిస్తుందని చెప్పారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్క్లాస్కోచ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
ఈస్టర్ సందర్భంగా కల్వరికి ప్రత్యేక ఎంఎంటీఎస్‌లు
హైదరాబాద్ సిటీలోని కల్వరి టెంపుల్ లో ఈ నెల 20న జరిగే ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా వివిధ ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ –లింగంపల్లి మధ్య నడిచే ట్రైన్ ఈ నెల 20న ఉదయం 3.15 గంటలకు హైదరాబాద్‌నుంచి బయల్దేరి లింగంపల్లికి ఉదయం 4.05 నిమిషాలకు చేరుకుంటుందని చెప్పారు.
లాగే ఫలక్‌నుమా– లింగంపల్లి మధ్య నడిచే ట్రైన్ ఉదయం 2.30 గంటలకు ఫలక్‌నుమా నుంచి, సికింద్రాబాద్‌నుంచి 3.05 /3.10 గంటలకు బయల్దేరే ట్రెయిన్లింగంపల్లికి ఉదయం4 గంటలకు చేరుకుటుందని పేర్కొన్నారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా మధ్య నడిచే ఎంఎంటీఎస్ఉదయం 2.50 గంటలకు లింగంపల్లి నుంచి, సికింద్రాబాద్ నుంచి 3.30/3.35గంటలకు బయల్దేరి ఫలక్‌నుమాకు ఉదయం 4.30 గంటలకు చేరుకుంటుందని అధికారులు వివరించారు.