కరీంనగర్ జిల్లాలో వేసవి ఉష్టోగ్రతలు 46 డిగ్రీలకు చేరుతున్నాయి. మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. భానుడి ప్రతాపానికి ఎప్పుడూ సందడిగా ఉండే కరీంనగర్ చౌరస్తా, అల్గునూరు చౌరస్తాలు ఉదయం 11 గంటలకే నిర్మానుష్యంగా మారాయి.
అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు గొడుగులు వాడుతుండగా, మహిళలు నెత్తిన వారి కొంగులను కప్పుకుంటున్నారు. ఇండ్లల్లో ఉన్నా కూలర్లు, ఏసీల వాడకం తప్పడం లేదు.
వెలుగు ఫొటోగ్రాఫర్, కరీంనగర్