
స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. సమ్మర్ ట్రిప్‌నకు పిల్లలు ప్లాన్ వేసుకుంటారు. ఈ ఏడాది ఏఏ ప్రదేశాలకు వెళ్లాలి.. అక్కడ ఏమేమి చూడాలి.. కుటుంబసభ్యులతో వెళ్లాలా.. ఫ్రెండ్స్ తో వెళ్లాలా అని ఇప్పటికే ఎవరి ప్లాన్ వారు వేసేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. సమ్మర్ హాలిడే ట్రిప్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. . . .
ఎండా కాలం వచ్చిందంటే పిల్లలకు సెలవులు ఇస్తారు. దాంతో ఏదైనా కొత్తప్రదేశానికి వెళ్లడానికి కుటుంబంలోని వాళ్లందరూ ప్లాన్ చేసుకుంటారు. మామూలు రోజుల్లో అయితే పర్లేదు కానీ, వేసవికాలంలో విహారయాత్రకు వెళ్లాలంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవైపు ఎండలు మండిపోతుంటాయి. మరోవైపు కొత్త ప్రదేశాలు.. వేసవికాలంలో పిల్లలకే కాదు పెద్దవాళ్లకూ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే రైల్లో అయినా. బస్సులో అయినా ప్రయాణాన్ని ఉదయం పది గంటల లోపు.. సాయంత్రం ఐదు తర్వాత మాత్రమే చేయాలి.
Also Read:-వేగంగా నడవండి.. గుండెను కాపాడుకోండి..
కూల్ డ్రింక్స్ తాగకపోవడమే మంచిది. వాటర్ బాటిల్ ఎప్పుడూ దగ్గరే ఉంచుకోవాలి. చెరుకురసం, కొబ్బరి బోండాలు తాగడం వల్ల శరీరాన్ని పడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. ప్రయాణాల్లో లేతరంగుల వస్త్రాలు, శరీరానికి అతుక్కుని ఉండేవి కాకుండా ధరించాలి. అవసరమైతే సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, వెళ్లిన ప్రదేశంలో కొత్తరకం ఫుడ్ దొరికితే ట్రై చెయ్యకూడదు. ఎందుకంటే.. ఒక్కోసారి అవి గిట్టక అనారోగ్యల బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లల ఆరోగ్యం గురించి విధిగా పట్టించుకోవాలి.