
సమ్మర్ సీజన్లో కూల్ కూల్ గా ఐస్క్రీం తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఫ్రూట్స్ ఐస్ క్రీం ఆరోగ్యం.. రుచి రెండూ ఇస్తాయి. పుచ్చకాయతో తయారు చేసిన ఐస్ క్రీం శరీరానికి కావలసిన పోషకాలు అందిస్తుంది. అయితే దీనినిన మార్కెట్లో కొనేకంటే ఇంట్లో తయారు చేసుకోవడడే చాలా బెటర్.. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువుగా ఉంటుంది. ఇది తింటుంటే ఉండే అనుభూతి వేరు.. పుచ్చకాయ సాధారణంగా తియ్యగా ఉంటుంది. ఇక దానిలో క్రీమ్ కలిపి ఐస్ క్రీం తయారుచేసుకొని తింటే ఆ టేస్ట్ అదిరిపోతుంది. అలాంటి టేస్టీ ఐస్ క్రీం.. పోషకాలున్న పుచ్చకాయ ఐస్ క్రీంను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. . .
పుచ్చకాయ ఐస్ క్రీం తయారీ కావలసిన పదార్థాలు:
- తరిగిన పుచ్చకాయ ముక్కలు ( విత్తనాలు లేకుండా) : 3 కప్పులు
- చక్కెర : ఒక కప్పు
- చిక్కటి క్రీమ్ : ఒక కప్పు
- కండెన్స్డ్ మిల్క్ (తీపి చేసిన పాలు): ఒక కప్పు
- నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు: చిటికెడు ( రుచికోసం)
తయారీ విధానం: పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో విత్తనాలను పూర్తిగా తీపివేయాలి. తరువాత గిన్నెలో కాని ఫుడ్ ప్రాసెసర్ లో కాని వేసి గుజ్జుగా తయారు చేయాలి. తరువాత ఈగుజ్జును వడకట్టి అందులో నిమ్మరసం బాగా కలపండి. తరువాత మరో పెద్ద గిన్నెలో కి ఈ రసాన్ని తీసుకొని అందులో చిక్కటి క్రీమ్ కలిపి నురుగు వచ్చే వరకు బాగా గికలకొట్టండి. తరువాత ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలపండి. ఇప్పుడు పుచ్చకాయ గుజ్జును ఇందులో వేసి బాగా కలియపెట్టి.. ఉప్పు , పంచదార వేసి అన్ని పదార్దాలు కలపండి. తరువాత ఆ గిన్నెకు మాత పెట్టి 2 గంటలు డీఫ్రీజ్ లో పెట్టండి. రాత్రంతా పెడితే ఇంకా మంచిది. తరువాత ఇలా గట్టిపడిన తరువాత వాటిని కప్ ల్లో సర్వ్ చేసుకోండి. అంతే పుచ్చకాయ ఐస్ క్రీం రెడీ..