జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు ప్రస్తుతం శని సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. నెలకి ఒకసారి సూర్యుడు రాశి చక్రం మారుస్తూ ఉంటాడు. మరికొన్ని రోజుల్లో సూర్యుడు కుంభ రాశిని వదిలి మరొక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి నెలలో సూర్య భగవానుడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు, దేవ గురువు బృహస్పతి ఏడాది తర్వాత కలుసుకోబోతున్నాయి. మార్చి 14 న సూర్యుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 12 వరకు మీన రాశిలోనే సంచరిస్తాడు. సూర్యుడు రాశి మార్పు ఏ రాశి భవిష్యత్ ని మార్చబోతుందో చూద్దాం.
గ్రహాల రాజు సూర్యుడు కదలికకి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ఆధ్యాత్మికం, తేజస్సు, జ్ఞానోదయం, కీర్తి, సంపద, ఆనందానికి ప్రతీకగా నిలుస్తాడు. అందుకే జాతకంలో సూర్యుని స్థానం బలంగా ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు.
వృషభ రాశి: దేవ గురువు, గ్రహాల రాజు కలయిక వల్ల వృషభ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆగిపోయిన పనులు తిరిగి పునః ప్రారంభిస్తారు. కెరీర్ లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్త అందుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఉద్యోగ రీత్యా విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంది. సంతానం వైపు నుంచి మీకు సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ధన లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
సింహ రాశి : సూర్య సంచారం సింహ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఒక విషయంలో చెడు జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు.
కన్యా రాశి : సూర్యుడు రాశి మార్పు కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు విదేశీ ఒప్పందాలు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా సమసిపోతాయి. సూర్యుని శుభ ప్రభావంలో మీ ఆర్తి పరిస్థితి మెరుగుపడుతుంది. భూమి, వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి సమయం.
ALSO READ :- వాట్సాప్ లో కొత్త ఫీచర్..!
ఉద్యోగ స్థలంలో ప్రశంసలు దక్కుతాయి. లవ్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మీకు, మీ భాగస్వామికి మధ్య బంధం బలపడుతుంది. ప్రేయసితో మధురమైన సమయం గడిపేందుకు అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఈ సమయంలో ప్రయోజనకరంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు విజయం చేకూరుతుంది.
కుంభరాశి: శని సొంత రాశి కుంభ రాశిని వదిలి సూర్యుడు మీన రాశి ప్రవేశం చేయబోతున్నాడు. ఫలితంగా సూర్య సంచారం కుంభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఖర్చులుకూడా పెరుగుతాయి. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చులు అంచనా వేసుకోవాలి. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించేందుకు అనువుగా ఉంటుంది. వైవాహిక జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది.