జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!

జ్యోతిష్యం : బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.. ఈ 5 రాశుల వారికి ఏ పని చేసినా విజయమే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవగ్రహాల కదలికలు.. ఏ గ్రహం ఏ సమయంలో ఏ నక్షత్రంలో సంచరిస్తుంది.. ఏ రాశిలో  యేయే గ్రహాలు కలిసి ఉన్నాయి అనే అంశాలను లెక్కించి జ్యోతిష్య పండితులు జాతకాలు చెబుతుంటారు.  అయితే ఒక్కో గ్రహం ఒక్కో రాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి అదృష్టం కలసి వస్తుంది.  ప్రస్తుతం గ్రహాలకు రారాజు సూర్యుడు సూర్యుడు జనవరి 24 న శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశించగా.. జనవరి 30న బుధుడు కూడా శ్రవణా నక్షత్రంలోకి మారనున్నాడని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  సూర్యుడు తన రాశిని మార్చినప్పుడల్లా కొంతమందికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతారు . సూర్యుడు.. బుధుడు.. విష్ణుమూర్తి నక్షత్రం అయిన శ్రవణంలో కలిసినప్పుడు  బుధాదిత్య యోగం ఏర్పడనుంది.  దీని వలన  ముఖ్యంగా ఐదు రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. బుధాదిత్య యోగం వలన  ఏ ఏ రాశుల వారికి ప్రయోజనాలను కలిగిస్తుందనే విషయాలను గురించి  తెలుసుకుందాం.

మేషరాశి : జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం...  బుధాదిత్య యోగం  ( సూర్యుడు, బుధుడు శ్రవణా నక్షత్రంలో కలవడం) వలన  మేష రాశి వారు ఆర్థికంగా బలపడతారు.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  మేషరాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది.   పెళ్లి.. ప్రేమ విషయంలో మొదట్లో కొన్ని అవాంతరాలు ఏర్పడినా... చివరికి మీరు అనుకున్నదే జరుగుతుంది. 

వృషభ రాశి:  సూర్యుడు.. బుధుడు కలవడం వలన వృషభ రాశి వారు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  బుధాదిత్యయోగం వలన ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది.  అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి  రావడంతో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది.  పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

సింహ రాశి:  బుధాదిత్యయోగం ( సూర్యుడు, బుధుడు శ్రవణా నక్షత్రంలో కలవడం) వలన సింహరాశికి వారికి సమాజంలో కీర్తి.. గౌరవం.. ప్రతిష్ఠ పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడంతో .. ఇబ్బందులు తీరుతాయి.  కొన్ని కొత్త వనరులు ఏర్పడుతాయి.  కొత్త ఆలోచనలతో తీసుకున్న నిర్ణయాలు.. కొత్త ప్రణాళికలు కలసి వస్తాయి.  ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు పుష్కలంగా ఉంటుంది.  ప్రమోషన్ రావడం.. వేతనం పెరగడం ... కొన్ని కొత్త బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాల కలసి వస్తుంది.  అనుకోకుండా లాభాలు వస్తాయి.  షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారు ఊహించని లాభాలు పొందుతారు.  

ధనుస్సు రాశి :  ఈ రాశి వారికి బుధుడు... సూర్యుడు కలయిక కొత్త జీవితానికి నాంది పలికే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఈ రాశి వారు అన్నీ రంగాల్లో విజయం సాధిస్తారు. బుధాదిత్య యోగ( సూర్యుడు, బుధుడు శ్రవణా నక్షత్రంలో కలవడం) ప్రభావంతో ప్రతి పనిలోనూ  మీ వెంటే విజయం ఉంటుంది. విదేశాలకు వెళ్లే వారికి అనుకూలంగా ఉండటమే కాకుండా.. లాభదాయకంగా ఉంటుంది.  ఉద్యోగస్తుల విషయంలో  ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.  వ్యాపారస్తులకు ఒక్కసారిగా... అనుకోకుండా లాభాలు వస్తాయి.  ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. తోబుట్టువుల మధ్య విబేధాలు తొలగి ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. . మీ పాత బంధువులను కలిసే అవకాశంతోపాటు.. . కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

మకరరాశి:  సూర్యుడు..బుధుడు .. శ్రవణా నక్షత్రంలో కలవడం వలన జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడటంతో... గతంలో ఉన్న బాకీల నుంచి విముక్తి పొందుతారు.   ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.  వృత్తి పరంగా పురోగతి ఉంటుంది.  వ్యాపారస్తులు లాభాల బాటలో పయనిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెడితే మూడు రెట్లు లాభాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు.  కొత్తగా భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో కలిసి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విహార యాత్రలు చేయడంతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.