సూర్యుడిపై రేడియో విస్పోటనం.. GIFలను విడుదల చేసిన నాసా

సూర్యుడి నుంచి మంటలు వస్తున్నట్లు.. GIFలను విడుదల చేసింది నాసా. సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకు సంబంధించి GIF లను నాసా విడుదల చేసింది. ఈ నెల 7,8 తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్టు తెలిపింది.వీటిని ఎక్స్-క్లాస్ ఫ్లేర్స్ అంటారని చెప్పింది. ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని, ఇవి భూమి వైపుగా ప్రసరించినప్పుడు ఉపగ్రహాలు,జీపీఎస్, రేడియో సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతుందని వివరించింది. 

సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్‌లో చివరి దశలో ఉన్నాడు. దీంతో సూర్యుడిపై పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. 2025లో గరిష్ట సన్‌స్పాట్ యాక్టివిటీ పెరుగుతుందని అంచనా. సూర్యుడి సౌరచక్రంలో తన అయస్కాంత ధృవాలను మార్చుకుంటాడు. దీంతో ఉపరితలంపై సన్‌స్పాట్‌లు ఎక్కువగా ఏర్పడటంతో పాటు సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ పెరుగుతున్నాయి. భారీ సౌర విస్పోటనాలు జరుగుతున్నాయి.

గత 6 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా సూర్యుడిపై అతిపెద్ద సౌర జ్వాల ఎగిసి పడింది. ఇది భూమిపై ఉన్న రేడియో కమ్యూనికేషన్లకు తాత్కాలికంగా అంతరాయం కలిగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గురువారం ( మే 9)  సూర్యుడిపై భారీ రేడియో విస్పోటనం సంభవించిందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని నుంచి ఎగిసిపడిన మంటలు భూమి వైపుగా వస్తోంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) ప్రకారం....భూఅయస్కాంత తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనల్ మాస్ ఎజెక్షన్‌ల (CMEలు) భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం సూర్యుడి నుంచి వెలువడిన సౌరజ్వాల గత ఆరేళ్లలో ఇదే పెద్దదని చెబుతున్నారు. వీటి వల్ల భూమిపై ఉన్న మనుషులకు, జీవాలు, ప్రకృతికి పెద్దగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం, సూర్యుడి నుంచి వచ్చే ఆవేశిత కణాలను అడ్డుకుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే రేడియో సిగ్నల్స్, శాటిలైట్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. ఈ జియో మ్యాగ్నటిక్ స్ట్రోమ్స్ వల్ల ధృవాల వద్ద ఆరోరాలని పలువబడే ప్రకాశవంతమైన కాంతి ఏర్పడుతుంది.