
న్యూఢిల్లీ: జుట్టు సమస్యలకు కారణమయ్యే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ చికిత్సకు ఉపయోగించే ఎల్ఈక్యూఎస్ఈఎల్వీఐ అనే డ్రగ్‌ను విడుదల చేయడంపై ఉన్న ఆంక్షలను వెంటనే తొలగించేలా అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేసిందని సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది.
ఎల్ఈక్యూఎస్ఈఎల్వీఐ (డ్యూరుక్సోలిటినిబ్) విషయంలో ఇన్‌సైట్ కార్పొరేషన్‌తో సన్ ఫార్మాకు పేటెంట్ ఉల్లంఘన విభేదాలు వచ్చాయి. ఈ విషయమై సన్‌ఫార్మా చేసిన వాదనను కోర్టు అంగీకరించింది. యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వెంటనే అమలులోకి వచ్చే నిషేధాన్ని రద్దు చేసిందని సన్‌ఫార్మా తెలిపింది.