న్యూఢిల్లీ: సన్ ఫార్మాస్యూటికల్, అరబిందో ఫార్మా కంపెనీలు యూఎస్ మార్కెట్ నుంచి కొన్ని ప్రొడక్ట్‌లను రీకాల్ చేస్తున్నాయి. తయారీలో సమస్యలు నెలకొనడంతో కొన్ని రకాల మందులను ఇరు కంపెనీలు రీకాల్ చేస్తున్నాయని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకటించింది. ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మా యూఎస్ సబ్సిడరీ 69,707 కార్టన్ల సెకా (సైక్లోస్పోరైన్ ఆఫ్తాల్మిక్ సొల్యూషన్) ను యూఎస్ మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. పొడి కళ్ల ట్రీట్‌మెంట్‌లో ఈ మెడిసిన్ వాడతారు.
ఈ కంపెనీ కిందటి నెల 7 న క్లాస్ 3 రీకాల్‌ను మొదలుపెట్టింది. అరబిందో ఫార్మా 9,890 బాటిళ్ల రాసగిలైన్ ట్యాబ్లెట్లను రీకాల్ చేస్తోంది. పార్కిన్సన్ చికిత్సలో ఈ మెడిసిన్స్‌ను వాడతారు. ఈ డ్రగ్ తయారీలో కొన్ని కరగని స్పెసిఫికేషన్ మిగిలాయని, అందుకే రీకాల్ చేస్తోందని యూఎస్ ఎఫ్‌డీఏ వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 2 న క్లాస్ 2 రీకాల్‌ను కంపెనీ ఇనీషియేట్ చేసింది.