
న్యూఢిల్లీ: ఇమ్యునోథెరపీ కంపెనీ చెక్ పాయింట్థెరప్యూటిక్స్ను 355 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3,100 కోట్లకు) కొంటున్నామని సన్‌ఫార్మా సోమవారం ప్రకటించింది. ఒప్పందంలో భాగంగా ఇది ఒక్కో స్టాక్‌కు ముందస్తుగా 4.10 డాలర్ల చొప్పున చెల్లిస్తుంది.
సాలిడ్ ట్యూమర్ క్యాన్సర్స్ బాధితులకు ఇది మెడిసిన్స్ తయారుచేస్తుంది. నాస్డాక్లో లిస్టయింది. చెక్ పాయింట్ తమ చేతికి రావడం వల్ల అంకో డెర్మో థెరపీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించగలుగుతామని సన్‌ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ అన్నారు.