
న్యూఢిల్లీ: తయారీలో సమస్యలు ఉండడంతో యూఎస్‌లో కొన్ని రకాల మందులను సన్ ఫార్మా, జైడస్ ఫార్మాస్యూటికల్స్ రీకాల్ చేస్తున్నాయి. యూఎస్ ఎఫ్‌డీఏ రిపోర్ట్ ప్రకారం, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఐఎన్‌సీ 9,840 మోర్ఫైన్ సల్ఫేట్ ఎక్స్‌టెండెడ్ రిలీజ్ ట్యాబ్లెట్లను రీకాల్ చేస్తోంది. ఈ ట్యాబ్లెట్లను పెయిన్ రిలీఫ్ కోసం వాడతారు. క్లాస్ 2 రీకాల్‌ను కంపెనీ ఫిబ్రవరి 26, 2025న చేపట్టింది.
క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో వాడే నెలరబైన్ ఇంజెక్షన్‌ను జైడస్ ఫార్మా రీకాల్ చేస్తోంది. మొత్తం 250 ఎంజీ లేదా 50 ఎంజీ కెపాసిటీ ఉన్న 36,978 వయల్స్‌ను రీకాల్ చేయడానికి ఈ ఏడాది ఫిబ్రవరి 13న క్లాస్2 రీకాల్ చేపట్టింది. అదనంగా 1,893 వయల్స్‌ను కూడా రీకాల్ చేస్తోంది.