మేళ్లచెరువు శివాలయంలో శివలింగాన్ని తాకిన సూర్య కిరాణాలు

మేళ్లచెరువు శివాలయంలో శివలింగాన్ని తాకిన సూర్య కిరాణాలు

మేళ్లచెరువు, వెలుగు : మేళ్లచెరువు శివాలయంలో శివలింగాన్ని ఆదివారం సూర్యకిరణాలు తాకాయి. ఏటా మాఘమాసంలో బహుళ దశమి రోజున గర్భాలయంలోని శివలింగంపై సూర్యకిరణాలు పడతాయి. ఇలా 40 రోజులపాటు కిరణాలు శివలింగంపై పడుతుంటాయని అర్చకుడు విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివలింగంపై కిరణాలు సంపూర్ణంగా తాకుతాయని చెప్పారు.