
- భక్తుల తన్మయత్వం
- ఏడాదిలో రెండు సార్లు మహాఘట్టం
కీసర, వెలుగు: కీసర ఆలయంలో శుక్రవారం సాయం సంధ్య వేళ అద్భుతం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని శ్రీ భవానీ రామలింగేశ్వరుడిని సుమారు 20 నిమిషాల పాటు భానుడి కిరణాలు స్పర్శించాయి. శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నుంచి 5:45 మధ్య సూర్యాస్తమయాన రాజగోపురం మీదుగా ప్రయాణించి.. మహా మండపం దాటిన కిరణాలు గర్భగుడిలోని మహాదేవుడిని తాకాయి.
ఈ మనోహర సన్నివేశాన్ని తిలకించిన భక్తులు పరవశించి పోయారు. ఇలా ఏడాదిలో రెండు సార్లు మాత్రమే జరుగుతుందని, శ్రీ రామనవమికి ముందు ఒకసారి, చలికాలంలో మరోసారి ఈ సుందర దృశ్యం కనిపిస్తుందని ప్రతి రోజూ వేద పారాయణం చేసే సత్యనారాయణ మూర్తి తెలిపారు.