SRH vs KKR: నాయకుడిపైనే భారం.. సన్ రైజర్స్‌ను ఫైనల్‌కు చేరుస్తాడా..?

SRH vs KKR: నాయకుడిపైనే భారం.. సన్ రైజర్స్‌ను ఫైనల్‌కు చేరుస్తాడా..?

జట్టులో స్టార్ ప్లేయర్లు ఎంతమంది ఉన్నా వారిని నడిపించే నాయకుడు లేకపోతే విజయం సాధించడం కష్టం. సాధారణ జట్టుకు ఒక గొప్ప నాయకుడు ఉంటే ఆ జట్టు విజయాలు సాధించగలదు. ఈ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్కీ అనే చెప్పాలి. 2023 ఐపీఎల్ మినీ వేలంలో రూ.20.50 కోట్లు వెచ్చించి ఆస్ట్రేలియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ ను దక్కించుకుంది. కమిన్స్ ను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్.. బెంగళూరుపై పోటాపోటీగా వేలం పాల్గొన్నది. కమ్మిన్స్ కోసం అసలు వెనక్కి తగ్గని సన్ రైజర్స్ ఆక్షన్ లో భారీ ధరకు సొంతం చేసుకుంది.  

స్టార్ ప్లేయర్ అయినప్పటికీ.. ఒక ఫాస్ట్ బౌలర్ కోసం 20 కోట్లకు పైగా వెచ్చించడం అనవసరమనే అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అయితే కమ్మిన్స్ అందరి అంచనాలను తలక్రిందులకు చేశాడు. తనపై ఉంచిన నమ్మకాన్ని.. తనకు వెచ్చించిన ధరకు న్యాయం చేశాడు. కెప్టెన్సీతో ఆకట్టుకొని హైదరాబాద్ జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. టాప్ 2 లో స్థానం సంపాదించిన సన్ రైజర్స్..  కోల్‌‌‌‌‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌‌‌‌‌తో మంగళవారం (మే 22) క్వాలిఫయర్ 1 ఆడనుంది. 

ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోయినా మరో ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కు వెళ్లాలని సన్ రైజర్స్ బలంగా కోరుకుంటుంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు అగ్రెస్సివ్ స్టార్ట్ ఇస్తామని చెప్పిన కమ్మిన్స్ అనుకున్నది చేసి చూపించాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా సన్ రైజర్స్ కప్ కొడుతుంది లాక్ చేసుకోండి అని తెలుగు అభిమానులను దిల్ ఖుష్ చేశాడు.

సన్ రైజర్స్ టైటిల్ గెలవడానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిస్తే ట్రోఫీ మన చేతికి వస్తుంది. కానీ అది అంత ఈజీ కాదు. ప్లే ఆఫ్స్ వచ్చిన జట్లన్నీ బలమైనవే కాబట్టి 100 శాతం పోరాడితేనే విజయం దక్కుతుంది. ఇందులో భాగంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్ కమ్మిన్స్ కెప్టెన్సీపైనే ఆశలు పెట్టుకున్నారు. జట్టును ముందుండి నడిపించడంలో.. ఆటగాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఈ ఆసీస్ కెప్టెన్ ది సపరేట్ స్టయిల్. 

కమ్మిన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో విజయవంతమైన కెప్టెన్ గా పేరుంది. 2023 లో ఆస్ట్రేలియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ తో పాటు, భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ ను ఆసీస్ కు అందించాడు. పదునైన పేస్ బౌలింగ్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్ లో హిట్టింగ్ చేయగల సామర్ధ్యం ఉంది. దీంతో కమ్మిన్స్ తలచుకుంటే సన్ రైజర్స్ కప్ కొట్టడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి కమ్మిన్స్ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.