DC vs SRH : అభిషేక్ క్లాస్.. క్లాసెన్ మాస్.. SRH భారీ స్కోరు

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. సత్తా చాటారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై విరుచుకుపడి భారీ స్కోరు చేశారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (67, 36 బంతుల్లో) క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 

అతనికి తోడు హ్యారీ క్లసెన్ (53, 27 బంతుల్లో) మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అబ్దుల్ సమాద్ (28, 21 బంతుల్లో), అఖీల్ హోసీన్ (16, 10 బంతుల్లో) చెలరేగడంతో సన్ రైజర్స్ భారీ స్కోరు చేసింది.

ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5, 6 బంతుల్లో), కెప్టెన్ మాక్రమ్ (8, 13 బంతుల్లో) నిరాశ పరిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. మిచెల్ మార్ష్ సూప్ పేస్ కు (4 ఓవర్లు 4 వికెట్లు) సన్ రైజర్స్ కాస్త ఇబ్బంది పడింది.