
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం వలన మార్పు చాలా మంది జీవితాల్లో మార్పులు కలుగుగాయి. గ్రహాల మార్పు కారణంగా రాశిచక్రాలపై ప్రత్యేక ప్రభావం ఉంటుందిని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సూర్యుని సంచారముతో సింహరాశిలో బుధుడు, కుజుడు సూర్యుని కలయిక ఉంటుంది. ఈ కలయిక కారణంగా, కొన్ని రాశిచక్ర గుర్తుల స్థానికులు ఒక నెల పాటు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సింహ రాశిలో సూర్య సంచారము వలన ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. . .
నవగ్రహాలకు రాజు సూర్యుడు. సూర్యుడు తన సొంత రాశి సింహరాశిలోకి ఆగస్టు 17 న ప్రవేశించాడు. సింహరాశిలో సూర్యుడి సంచారంతో చాలా మంది జీవితాల్లో మంచి మార్పులను తీసుకువస్తాడు. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలుగజేయగా మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. . దీనిని సింగ్ సంక్రాంతి అని కూడా అంటారు.
మేషరాశి
సూర్యుడు సింహరాశిలో సంచరించడం వల్ల మేష రాశి విద్యార్థులకు చాలా శుభం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మేష రాశి వారి దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుందట. ఇప్పటి వరకు ఉన్న ఆర్ధిక సమ్యలు తొలగి ఈ కాలం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక ఉద్యోగుల విషయంలో తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి
సూర్యుని రాశిచక్రం మారుతున్న కాలంలో మీ కోపాన్ని నియంత్రించుకోవాని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ సమస్యలు ఏర్పడి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్కులు తెలిపారు. ఈ సమయంలో వృషభ రాశి వారు చర్చలకు దూరంగా ఉండే మంచిదని చెబుతున్నారు. అయితే ఉద్యోగులకు ప్రమోషన్ లభించి కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
మిధునరాశి
సూర్య భగవానుడు సింహరాశిలో సంచరించే సమయంలో మిధున రాశి వారికి అన్ని విధాల బాగుంటుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. అన్నదమ్ముల నుంచి పూర్తి సహాయ సహకారాలు అంది.. కొత్త స్నేహితులు ఏర్పడే అవకాశం ఉంది. గతంలో ఎవరికైనా అప్పు ఇస్తే ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశవ ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి
సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మారాడు. దీని ప్రభావం వలన కర్కాటక రాశి వారు కొన్ని ఆపదల నుంచి రక్షించుకోగలుగుతారని జ్యోతిష్య పండితులు తెలిపారు. ఇప్పటి వరకు కుంటుంబంలో ఉన్న చికాకులు తొలగి మనస్సు ప్రశాంతత కలుగుతుందట. రీసెర్చ్ చేసే విద్యార్థులకు . ఈ కాలం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి
సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి శ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. దీనివలన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ కాలంలో సింహరాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి
సూర్యుడు సింహరాశిలో సంచరించడం కన్యారాశి వారు ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ కాలంలో వారు అనుకున్న ప్రణాళికను అమలు చేస్తారు. ఇప్పటి వరకు వ్యతిరేకించిన పాత స్నేహితులు కూడా మద్దతు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కాని ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
తులారాశి
తుల రాశి వారికి సూర్యభగవానుని సంచారము వలన అపారమైన వ్యాపార ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్కులు చెబుతున్నారు. కొత్త వ్యాపారం ఊపందుకుంటుందని చెబుతుననారు. ఉద్యోగం ఎదురు చూసే వారికి జాబ్ ఆఫర్, ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి.
వృశ్చికరాశి
సింహరాశిలో సూర్యుడి సంచారం వలన రాజయోగం కలిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్థి వచ్చి చాలా లాభదాయకంగా ఉంటుందని తెలుపుతున్నారు. ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు ఇది చాలా అనుకూల సమయం. వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకున్న చిక్కులు తొలగి మానసిక ప్రశాంత లభించి... ఆర్థికంగా బలపడతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి సింహరాశిలో సూర్యుని సంచారం చాలా ప్రత్యేకమైనదట. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్న సమయంలో అదృష్టం ధనస్సు రాశి వారితోనే ఉంటుందట. వ్యాపారస్తులుకు ఎక్కువ లాభాలు వచ్చి... ప్రయాణాలు చేస్తారట. విదేశాలలో చదువుకోవాలనుకొనే విద్యార్థుకు కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు.
మకరరాశి
సూర్యుడు సింహరాశిలో సంచారం వలన మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయని పండితులు చెబుతున్నారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. కాని కొన్ని అనవసర ఖర్చులు పెరుగుతాయి. అయితే ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
కుంభ రాశి
సింహరాశిలో సూర్యుడు సంచరించడం వల్ల కుంభ రాశి వారి శత్రువులు ఓడిపోతారు. ఆర్థి్క విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఈ కాలంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ వృత్తి జాతకం ఈ కాలంలో ప్రమోషన్ పొందవచ్చు. ఆరోగ్య విషయంలో తలనొప్పి, కళ్లలో చికాకులు ఎదురవుతాయని చెబుతున్నారు.
మీన రాశి
సూర్యుడు సింహరాశిలో సంచారం వలన మీన రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఇది అనుకూల సమయం. సింహరాశిలో సూర్యుని సంచారంతో భార్య తరపునుంచి ఆస్తి వచ్చే అవకాశం ఉందని...ప్రభుత్వ ఉద్యోగులు సానుకూల ఫలితాలు పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.