యూట్యూబర్ గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న హర్ష చెముడు(Harsha Chemudu) ప్రధాన పాత్రలో వచ్చిన మూవీ సుందరం మాస్టర్(Sundaram Master). కళ్యాణ్ సంతోష్(Kalyan Santosh) దర్శకత్వం వహించిన ఈ సినిమాను మాస్ మహారాజ్ రవితేజ, శ్వేత, సుధీర్, హేమంత్ సంయుక్తంగా నిర్మించారు. టీజర్. ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? హర్ష మొదటి సినిమా హిట్టు కొట్టాడా? అసలు ఈ సుందరం మాస్టర్ కథేంటి? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సుందరం(హర్ష చెముడు) గవర్నమెంట్ టీచర్. ఇంగ్లీష్ నేర్పించడానికి మిర్యాలమెట్ట అనే గ్రామానికి వస్తాడు. కానీ, అక్కడి గ్రామస్తులు అప్పటికే ఇంగ్లీష్ మాట్లాడటం చూసి సుందరం ఆశ్చర్యపోతాడు. అంతేకాదు.. ఆ ఊరి పద్ధతులు, కట్టుబాట్లు భలే విచిత్రంగా ఉంటాయి. వాటివల్ల సుందరం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? వెళ్లిన పనిని సుందరం పూర్తి చేస్తాడా? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
చెప్పుకోవడానికి చిన్న కథే కానీ దాని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. మరీ ముఖ్యంగా ప్రధమార్టం ఆడియన్స్ ను చాలా నవ్విస్తుంది. మిర్యాలమెట్ట ప్రజలు, వారి జీవన విధానం, సుందరం మాస్టర్ ఎంట్రీ తరువాత వచ్చే సీన్స్ చాలా కామెడీగా ఆడియన్స్ ను ఫులుగా నవ్విస్తాయి.
అయితే ద్వితీయార్థం మాత్రం ఆడియన్స్ ఓపికకు పరీక్షా అనే చెప్పాలి. ప్రధమార్థంలో ఉండే ఫన్ అసలు కనిపించదు. అంతేకాదు సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకోవడం కూడా సహజంగా అనిపించదు. దాంతో ఆడియన్స్ కథ నుండి డిస్కనెక్ట్ అవుతారు. ఇక కైమాక్స్ ఉద పెద్దగా ఆకట్టుకోలేదు. కావాలని ముగించినట్టు అనిపిస్తుంది. ఆ సన్నివేశాలను డీల్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కామెడీగా సాగిన సుందరం మాస్టర్.. సెకాండాఫ్‌లో నిరాశపరుస్తాడు. అదే రేంజ్ లో ఉంది ఉంటే కొంత బెటర్ గా ఉండేది.
నటీనటులు:
యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హర్ష ఈ సినిమాలో సుందరం మాస్టర్ గా మెప్పించాడు. తదైనా కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. తన అమాయకత్వంలో పాత హర్షను గుర్తుచేశాడు. ఇక హీరోయిన్ గా చేసిన దివ్య శ్రీపాద కూడా చాలా బాగా చేశారు. మిగిలిన పాత్రలో చేసిన నటులు కూడా పాత్ర మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు:
సుందరం మాస్టర్ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం చాలా బాగుంది. తన సోల్ ఫుల్ మ్యూజిక్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకుకెళ్ళాడు. ఇక దీపక్ యరగెరా కెమెరా వర్క్ కూడా చాలా సహజంగా ఉంది. మిర్యాలమెట్ట గ్రామానికి తన కెమరాతో సహజత్వాన్ని జతచేశాడు. సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉండే కెమరా వర్క్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.
ఇక దర్శకుడు కళ్యాణ్ సంతోష్ గురించి చెప్పాలంటే.. తాను నమ్మిన కథను అంతే నిజాయితీగా తెరపై చూపించాడు. చాలా సహజంగా ప్రెజెంట్ చేశాడు. అయితే ప్రథమార్థం మీద పెట్టిన శ్రద్ధ ద్వితీయార్ధం మీద కూడా పెట్టి ఉండే బాగుండేది అనిపిస్తుంది. సుందరం మాస్టర్ సినిమాకు సెకండ్ హాఫ్ చాల పెద్ద మైనస్ గా మారింది. క్లిమక్స్ కూడా చుట్టేశాడు. కథపై ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది అనిపిస్తుంది.
ఇక సుందరం మాస్టార్ సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ..