తిమ్మాపూర్, వెలుగు: తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో మంజూరైన గౌడ సంఘం భవనాన్ని వెంటనే నిర్మించాలని గౌడన్నలు ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంఘం భవనం చేపడతానని 6 ఏండ్ల కింద భూమి పూజ చేశారని, నేటికీ నిర్మాణం పూర్తికాలేదన్నారు.
ALSO READ :బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలి: నిరంజన్ రెడ్డి
ఇప్పటికైనా రానున్న రోజుల్లో బిల్డింగ్పూర్తి చేయాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో గౌడ కులస్తులమంతా ఏకమై ఆయనను ఓడించేందుకు పనిచేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమేశ్ గౌడ్, లీడర్లు మల్లేశం, శ్రీనివాస్, సంపత్, మోహన్, పర్షరాములు, ప్రదీప్, మొగిలి పాల్గొన్నారు.