
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలోని గర్భగుడి, అర్ద మండపంలోని ద్వారాలకు సెన్సార్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు ఆదివారం ఆలయ అధికారులు తెలిపారు. దీనివల్ల ఆలయంలో సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుందన్నారు. ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు, ఆలయ అధికారులకు సమాచారం అందుతుందన్నారు. ఈ సెన్సార్ సిస్టం ఏర్పాటుకు సుమారు రూ.లక్ష ఖర్చయినట్లు తెలిపారు.
కాగా సెలవు దినం కావడంతో ఆలయనికి భక్తులు పోటెత్తారు. అభిషేకం, నిత్యకల్యాణం, గంగిరేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనల ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు. ఏఈవోలు అంజయ్య, గంగ శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్ భక్తులకు సేవలందించారు.