సందీప్ కిషన్ హీరోగా ‘ధమాకా’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న టీమ్.. కొత్త షెడ్యూల్‌ను వైజాగ్‌లో ప్రారంభించారు.
20 రోజుల లెంగ్తీ షెడ్యూల్‌లో సందీప్ కిషన్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. సంక్రాంతికి సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నందున ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
సందీప్ కెరీర్‌లో ఇది 30వ సినిమా. రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ధమాఖా, నేను లోకల్ సినిమాల రైటర్ ప్రసన్నకుమార్ కథ, కథనం, మాటలు అందిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ విభిన్న పాత్రలో కనిపించనున్నారట. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక త్రినాధరావు ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజతో ధమాకా లాంటి భారీ హిట్ అందించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో సందీప్ కిషన్, త్రినాధరావు సినిమాపై ఇప్పటినుండే అంచనాలు ఏర్పడుతున్నాయి.
#Mazaka Vizag Schedule Begins,
— AK Entertainments (@AKentsOfficial) October 21, 2024
Students flock to say Hello to our People’s Star @SundeepKishan❤️🔥
Over the next 20 days, crucial scenes & action sequence to be shot in Vizag✨
A @TrinadharaoNak1 Mass Entertainer 🤟🏻
In Theatres,
SANKARANTHI 2025 🧨@KumarBezwada✍️… pic.twitter.com/6dwyr4xYFU