హిట్టు కొట్టాడు..హిట్టు డైరెక్టర్ను పట్టాడు.. ‘మ‌జాకా’ అంటూ వ‌స్తున్న సందీప్ కిషన్

హిట్టు కొట్టాడు..హిట్టు డైరెక్టర్ను పట్టాడు.. ‘మ‌జాకా’ అంటూ వ‌స్తున్న సందీప్ కిషన్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) ఇటీవలే ఊరు పేరు భైరవకోన(Ooru Peru Bhairavakona) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడు వీఐ ఆనంద్(VI Anand) తెరకెక్కించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఓవర్ ఆల్ గా రూ.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మోస్తారు లాభాలు తెచ్చిపెటింది.

ఇక చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కు ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఊరుపేరు భైర‌వ‌కోన పాటు, కెప్టెన్ మిల్ల‌ర్‌, రాయ‌న్ సినిమాల‌తో హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో మ‌రోకొత్త సినిమాను మొదలుపెట్టేశాడు.   
 
దర్శకుడు త్రినాధరావు నక్కినతో తన నెక్స్ట్ సినిమాను చేయబోతున్నాడు సందీప్. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. #SK30 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకి తాజాగా టైటిల్తో పాటు రిలీజ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు మేకర్స్.

ఈ సినిమాకు మ‌జాకా (Majaka)అంటూ హుషారైన టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్‌లో సందీప్ కిష‌న్ పంచె క‌ట్టులో కొత్తగా క‌నిపిస్తున్నాడు. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక త్రినాధరావు ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజతో ధమాకా లాంటి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో సందీప్ కిషన్, త్రినాధరావు సినిమాపై ఇప్పటినుండే అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఇక ఈ కొత్త సినిమాకు కూడా ధమాకా సినిమాకు కథ అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ కథని అందిస్తున్నాడు. పక్కా కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో సందీప్ కిషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.